రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి వైసీపీ పై సీబీఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ సంచలన కామెంట్స్..!!

ఈనెల 18వ తారీకు రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ, టీడీపీ పార్టీలు ఎన్డీఏ ప్రెసిడెంట్ అభ్యర్థి ద్రౌప‌ది ముర్ముకు మద్దతు తెలపడం జరిగింది.

 Jd Lakshmi Narayana Sensational Comments On Ycp Details, Jd Lakshmi Narayana, Y-TeluguStop.com

ఇటువంటి తరుణంలో సిబిఐ మాజీ జెడి లక్ష్మీనారాయణ… వైసీపీ పై సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.రాష్ట్రపతి ఎన్నికలలో బిజెపికి ఇతర పార్టీల మద్దతు అవసరమని దీంతో వైసిపి అవసరం కూడా ఏర్పడిందని అన్నారు.

ఇటువంటి పరిస్థితులలో ఏపీకి ప్రత్యేక హోదా విషయాన్ని వైసీపీ గట్టిగా బీజేపీ వద్ద డిమాండ్ చేయాలని కోరారు.ఇది సరైన అవకాశం వైసీపీ ఉపయోగించుకోవాలని సూచించారు.రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రత్యేక హోదా సాధించటం కోసం పార్టీలకతీతంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని జెడి లక్ష్మీనారాయణ పేర్కొన్నారు.రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల వల్ల ఒరిగేదేమీ లేదని తెలిపారు.

సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వం తీసుకొస్తున్న అప్పులు మరియు చేస్తున్న అభివృద్ధి కచ్చితంగా అడిగి తెలుసుకుంటామని అన్నారు.యువతకు ఉపాధి అవకాశాలు విషయంలో అన్ని పార్టీలు దృష్టి సారించాలని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube