బుల్లి తెర యాంకర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి అనసూయ (Anasuya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.జబర్దస్త్ యాంకర్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె ప్రస్తుతం వెండి తెర అవకాశాలను అందుకున్నారు.
ఇలా వరుస సినిమాల ద్వారా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా బిజీగా ఉండే ఈమె వివాదాల ద్వారా కూడా వార్తలలో నిలుస్తూ ఉంటారు.
ఇలా అనసూయ సోషల్ మీడియా వేదిక ఏదైనా పోస్ట్ చేసిన పెద్ద ఎత్తున వివాదంగా మారుతూ ఉంటుంది.ముఖ్యంగా ఈమెకు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) తో పెద్ద ఎత్తున వివాదాలు జరిగిన సంగతి తెలిసిందే.

విజయ్ దేవరకొండ సినిమాలను పరోక్షంగా ఈమె కామెంట్లు చేస్తే పోస్టులు చేయడంతో విజయ్ దేవరకొండ అభిమానులతో ఈమెకు పెద్ద ఎత్తున గొడవ జరిగింది.ఇలా తరచూ వివాదాలలో నిలిచే ఈమె కొత్త ఏడాదిలో అడుగు పెట్టగానే బూతులు తిడుతూ సోషల్ మీడియా వేదికగా చేసిన పోస్ట్ వైరల్ అవుతుంది.మరి ఈమె ఎందుకు ఫైర్ అయ్యారు అనే విషయానికి వస్తే.2023 లో నా మాటలు, బిహేవియర్ వలన ఎవరైనా బాధపడి ఉంటే మీకు మంచిగా అయ్యింది.

2024లో కూడా నేను ఇలానే ఉంటా.నా జోలికి వస్తే దూల తీర్చి, దూపం వేస్తా… అంటూ బూతులతో రెచ్చిపోయింది.ఇలా అనసూయ బూతుల తిరుగుతూ కొత్త సంవత్సరంలో ఇలాంటి పోస్ట్ చేయడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయ్యారు.అయితే అనసూయ పట్ల ఎంతమంది ఎన్ని రకాలుగా కామెంట్లు చేసిన ఈమె మాత్రం తన వ్యవహార శైలిని మార్చుకోలేదు.
తాజాగా తాను కొత్త సంవత్సరంలో( New Year ) కూడా ఇలాగే ఉంటానని ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక ఈ ఏడాదిలో ఈమె ఎన్నో వివాదాలలో చిక్కుకున్నప్పటికీ ఎన్నో సినిమాలలో నటించి పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేశారని చెప్పాలి.







