యూఎస్ఎ: అనుమానాస్పదంగా తిరుగుతున్న బస్సు ఆపి చూడగా.. అందులో షాకింగ్ దృశ్యం..??

అమెరికాలో ( America )అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ బస్సులో షాకింగ్ దృశ్యం కనిపించింది.అందులో జంతువులను అక్రమంగా తరలిస్తున్నారు.

 A Shocking Scene In The Usa When A Suspicious Moving Bus Stops, Animals, Poachin-TeluguStop.com

సాధారణంగా పశువులు మనకి చాలా ఇష్టమైన జీవులు.కొన్ని జంతువులను ఇంట్లో పెంచుకోవడంలో ఎలాంటి తప్పులేదు.

అయితే, వాటిని వేటాడటం, అక్రమంగా తరలించడం నేరం.అడవుల్లో ఏనుగుల దంతాల కోసం వేటాడటం, ఎముకల కోసం పులులను చంపడం అనధికార వన్యప్రాణి వ్యాపారానికి కొన్ని ఉదాహరణలు.

ఇటీవల అమెరికాలో జరిగిన ఓ సంఘటన చాలా కలవరపెట్టింది.

పెన్సిల్వేనియా రాష్ట్రంలో( Pennsylvania ) పసుపు రంగు బస్సుని పోలీసులు ఆపారు.

దాని లోపల డజన్లు కొద్దీ జంతువులని అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఆ జంతువులను చాలా మురికి ప్రాంతంలో ఉంచారు.

అక్రమంగా జంతువులని తీసుకెళ్తున్న ఓ బస్సు గురించి ఆడమ్స్ కౌంటీ SPCA (జంతు సంరక్షణ సంస్థ)కి టిప్ (ముందస్తు సమాచారం) వచ్చింది.పరిశీలించగా, పోలీసులు 30 కోళ్లు, బాతులు, టర్కీలతో పాటు మూడు జర్మన్ షెపర్డ్స్( German Shepherds ), ఒక ఆస్ట్రేలియన్ షెపర్డ్ కుక్కలను కనుగొన్నారు.

అదేంటి అని అడిగితే, ఆ కోళ్లను, బాతులను, టర్కీలను ఆ కుక్కలకు తిండిగా పెడుతున్నారట.ఇది తెలిసి అందరూ షాక్ అయ్యారు.

అంతేకాకుండా, ఆ బస్సుకు కట్టిన ట్రైలర్‌లో ఒక గుర్రం, ఒక ఎద్దు కూడా ఉన్నాయి.

Telugu Turkeys, Animals, Chickens, Pennsylvania, Usa, Yellow Bus-Latest News - T

అదనపు దర్యాప్తులో, ఈ జంతువులను లైంగిక వేధింపులకు ఉపయోగించుకుంటున్నారని తెలిసింది.బస్సు డ్రైవర్ షాన్ హిర్ష్‌బైన్‌ను( Shawn Hirschbein ) పశ్చిమ వర్జీనియాలో ఓ అరెస్ట్ వారెంట్‌ జారీ చేశారు.ఆ వారంట్‌ కిందే అతని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మైనర్లకు అశ్లీల సామాగ్రిని పంపిణీ చేశాడనే ఆరోపణలపై హిర్ష్‌బైన్‌పై మరికొన్ని కేసులు నమోదు అయ్యాయి.

Telugu Turkeys, Animals, Chickens, Pennsylvania, Usa, Yellow Bus-Latest News - T

ట్రైలర్ ఫొటోలలో జంతువులను మురికి, ఓపెన్ బకెట్లలో తిండి పెడుతున్నట్లు కనిపించింది.టైర్లతో పాటు నేలపై గడ్డి, మట్టి చెల్లాచెదురుగా పడిపోయినట్లు కూడా కనిపించింది.రక్షించిన జంతువులు ప్రస్తుతం ఆరోగ్య నిపుణుల సంరక్షణలో ఉన్నాయి.

వాటికి చికిత్స అందిస్తున్నారు.ఈ సంఘటన జంతువుల అక్రమ రవాణా, వేధింపుల తీవ్రమైన సమస్యను వెలుగులోకి తెచ్చింది, ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది.

అలాంటి అమానవీయ చర్యల నుంచి జంతువులను రక్షించడానికి చట్టాలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube