ఇటీవల ఒక ఆవు,( Cow ) ఇద్దరు వ్యక్తుల మధ్య ఊహించని సంఘటన చోటుచేసుకుంది.దానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో, ఒక యువకుడు, యువతి బైక్( Bike ) మీద వెళ్తుండగా, వారి వెనకాల ఒక ఆవు పరుగులు తీస్తుంది.కొంచెం ముందుకు వెళ్ళాక యువకుడు బైక్ ఆపేశాడు.
అమ్మాయి ఆవును వెళ్లగొట్టడానికి ప్రయత్నించింది.కానీ ఆ ఆవు ఆగ్రహంతో యువతిని వెంబడించి దాడి చేస్తుంది.
చివరకు, ఆమెను రోడ్డుపై పడేలా చేస్తుంది.
అదృష్టవశాత్తూ, పక్కనే ఉన్న వాళ్లు వెంటనే ఆ అమ్మాయిని( Woman ) కాపాడతారు.ఒక వ్యక్తి కర్రతో కొట్టగానే ఆవు పరుగులు తీసి వెళ్లిపోవడంతో అమ్మాయి ప్రాణాపాయం తప్పించుకుంటుంది.ఈ ఘటన చూసిన వారంతా ఆశ్చర్యపోతున్నారు.
కొంతమంది ఆవును తప్పు పడుతుండగా, మరికొందరు అమ్మాయి జాగ్రత్తగా ఉండకపోవడం వల్లే ఇలా జరిగిందని అంటున్నారు.మరి కొంతమంది మాత్రం అసలు ఆ వ్యక్తి బైక్ ఎందుకు ఆపాడు అని ప్రశ్నిస్తున్నారు.
కొద్దిగా వేగంతో వెళ్లిపోయి ఉంటే ఈ ప్రమాదం తప్పి ఉండేది అని అభిప్రాయపడుతున్నారు.
ఈ ఆవు దాడి( Cow Attack ) వీడియో సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఎక్స్ అనే ప్లాట్‌ఫామ్‌లో చాలా హల్ చల్ చేస్తోంది.ఈ వీడియో చూసిన వారు ఏదో ఒక కామెంట్ చేయకుండా ఉండలేకపోతున్నారు.చాలా మంది ఆ వీడియో కింద కామెంట్లు పెడుతున్నారు.
కొంతమంది ఆ యువతి ధైర్యాన్ని మెచ్చుకుంటున్నారు.ఎందుకంటే, ఆమె ఆవును ఎదుర్కోవడానికి ప్రయత్నించింది, అయితే ఆమెపై ఆవు దాడి చేసింది గాయాలయ్యాయి ఇది చూస్తే బాధగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసిన వారిలో చాలా రకాల భావోద్వేగాలు కనిపిస్తున్నాయి.కొంతమంది ఈ సంఘటన చూసి నవ్వుకుంటున్నారు, మరికొంతమంది ఆ యువతికి ఏమైందో చూసి ఆందోళన చెందుతున్నారు.