శ్రీ ఈశ్వర స్వామి ఆలయం లో మార్భాల్ రాతి తో గజస్తంభం ఏర్పాటు కు సన్న హాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం ఎదుట గల పురాతన శ్రీ ఈశ్వర స్వామి ఆలయం ( శ్రీ శివాలయం ) లో మార్బుల్ రాతి తో తయారు చేసే గజస్తంభం ఏర్పాటు చేయడానికి ఆదివారం పరిశీలించారు.శ్రీ ఈశ్వర స్వామి ఆలయం చాలా పురాణం కాలం నాటిది ఎల్లారెడ్డిపేట గ్రామం ఏర్పాటు చేసినప్పుడు శ్రీ ఈశ్వర స్వామి ఆలయం నిర్మించారని ఆ సమయంలో ఏర్పాటు చేసిన కర్రతో తయారు చేసిన గజస్తంభం శిథిలావస్థకు చేరుకున్నందున మార్బుల్ రాతి తో తయారు చేసేందుకు మాసాపేట కు చెందిన స్టోన్ వర్క్ షాఫ్ యజమాని పల్లపు సురేష్ తో మార్బుల్ రాతి తో 19 ఫీట్లన్నర గజస్తంభం పైన రెండు పీట్ల మెగనార్లతో తయారు చేయిస్తున్నారు.

 A Small Hall For Setting Up Gajasthambam With Marbhal Stone In Sri Ishwara Swamy-TeluguStop.com

రాతి స్తంభం చుట్టూ నాలుగు శివుని కి సంబంధించిన దేవుళ్ళ విగ్రహాలు చెక్కాలని నిర్ణయించారు.గజ స్తంభాన్ని మంచి రోజుల్లో వేద పండితులచే ప్రతిష్టించడానికి ఏర్పాటు చేస్తున్నారు.

గజ స్థంబాల నమూనాల ఆల్బాబాన్ని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయ కమిటీ గౌరవ సలహా దారు నంది కిషన్ బొమ్మకంటి శ్రీనివాస్ గుప్తా, ఆలయ అర్చకులు రాచర్ల హనుమాండ్ల శర్మ , బండారి బాల్ రెడ్డి ,కందుకూరి రవి, చందనం గోపాల్ స్టోన్ వర్క్ షాఫ్ యజమాని సురేష్ తదితరులు ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube