అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీతో( technology ) ట్రెండ్ ఎంతో మారుతూ ఉంది.మారుమూల ప్రాంత ప్రజల కూడా డ్రెస్సింగ్ లో తేడాలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇది పట్టణాలలో అయితే చెప్పనవసరం లేదు.పట్టణాలలో చిరిగిపోయిన బట్టలనే ఫ్యాషన్ గా ధరిస్తూ ఉన్నారు.
కానీ ఎంత ఫ్యాషన్ అయినా కొన్ని సంప్రదాయాలు కచ్చితంగా పాటించాలని పెద్దవారు చెబుతున్నారు.ముఖ్యంగా చెప్పాలంటే పూజలు చేసేటప్పుడు, దేవాలయాలకు వెళ్ళేటప్పుడు సంప్రదాయంగా ఉండాలి.
కానీ చాలా మంది ఆ పద్ధతి పాటించడం లేదు.ఫ్యాషన్ ఫ్యాషన్ అంటూ చిరిగిన దుస్తులతోనే దేవాలయాలకు వెళ్తున్నారు.
అయితే ఇలా ఫ్యాషన్ ఫాలో అయ్యే చాలా మందికి ఇప్పటికే కొన్ని దేవాలయాలు షాక్ ఇస్తున్నాయి.

ముఖ్యంగా చెప్పాలంటే ట్రెడిషనల్ డ్రెస్సులు, చున్నీలు వేసుకోకుండా ఆలయాలలోకి రాకూడదని నిబంధనను మరొక పుణ్యక్షేత్రం అమలు చేయనుందని ప్రకటించింది.ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఒడిశాలోని జగన్నాథ దేవాలయ నిర్వాహకులు భక్తుల విషయంలో ఈ కీలక తీసుకున్నారు.అలాగే పొట్టి దుస్తులు, చిరిగిన జీన్స్, స్కర్ట్స్, స్లీవ్‌లెస్ ( Jeans, skirts, sleeveless )లాంటి దుస్తులు ధరించిన భక్తులు దేవాలయంలోకి ప్రవేశించడం నిషేధం అని ప్రకటించారు.
అంతే కాకుండా భక్తులందరికీ ఈ డ్రస్ కోడ్ అమలు చేయనున్నట్లు తెలిపారు.ఇంకా చెప్పాలంటే దేవాలయానికి వచ్చే భక్తులు ఈ డ్రెస్ కోడ్ ను అనుసరించి మాత్రమే దేవాలయంలోకి ప్రవేశించాలి.
అలా చేయని వాళ్లకు ప్రవేశం లేదని గట్టిగా చెబుతున్నారు.

అలగే జగన్నాథ దేవాలయ నిర్వాహకులు( Jagannath Temple ) తీసుకున్న ఈ నిర్ణయం జనవరి ఒకటవ తేదీ నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించారు.ఈ నేపథ్యంలో దేవాలయ పాలసీ సబ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.ఈ డ్రెస్ కోడ్ ధరించిన వారికి మాత్రమే దేవాలయంలో ప్రవేశం ఉంటుందని వెల్లడించారు.
ఆలయం ఒక పవిత్రమైన స్థలం అని ఇక్కడ వినోదం కోసం రాకూడదని దేవాలయ ముఖ్య అధికారులు వెల్లడించారు.