మీరు దీపావళి ( Diwali festival )సందర్భంగా కొత్త దుస్తువులను కొంటూ ఉన్నారా? మీ రాశి ప్రకారం ఏ దుస్తులు కొని వాటిని ధరిస్తే ఎక్కువ లాభం పొందవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు కొత్త దుస్తువులు కొనుగోలు చేస్తూ ఉంటారు.
పండుగ రోజు కొత్త దుస్తువులు వేసుకోవడం ఫ్యాషన్ కాదు.దీని వెనుక మన సాంస్కృతి, సంప్రదాయాలు ఎన్నో ఉన్నాయని పండితులు చెబుతున్నారు.
కొత్త బట్టలు మంచికి సంకేతం.మన రాశి గ్రహం మన జీవన శైలి, మనం ధరించే దుస్తులు అన్ని ఒకదానికొకటి సంబంధం కలిగి ఉంటాయి.
మీరు దీపావళి సందర్భంగా కొత్త దుస్తుల కోసం షాపింగ్ చేస్తూ ఉంటే మీ రాశి ప్రకారం బట్టలు కొని వాటిని ధరించాలి.దీని ప్రకారం ఎక్కువ లాభాన్ని పొందవచ్చు.
ముఖ్యంగా చెప్పాలంటే మేష రాశి ( Aries )వారు తమ ధైర్యం, శక్తివంతమైన స్వభావానికి ప్రసిద్ధి చెందారు.వారి వ్యక్తిత్వాన్ని హైలైట్ చేసే ముదురు ఎరుపు, బంగారు రంగు ధరించడం మంచిది.అలాగే వృషభ రాశి వారు పచ్చ లేదా మెరూన్ వంటి లోతైన రంగుల దుస్తువులను ధరించాలి.అలాగే మిధున రాశి వారు రంగురంగుల దుస్తువులను ధరించడం మంచిది.
అలాగే కర్కాటక రాశి వారు బనారస్ సిల్క్ దుస్తువులను ధరించాలి.అలాగే సింహ రాశి( Leo ) వారు రాయల్ బ్లూ లేదా డార్క్ మెరూన్ దుస్తువులను ధరించాలి.
ముఖ్యంగా చెప్పాలంటే కన్యా రాశి వారు మృదువైన మృదువైన పాస్టెల్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చికాంకరి చీరను ధరించడం మంచిది.
వెండి నగలు దీనికి సరిగ్గా సరిపోతాయి.అలాగే తులా రాశి వారు పింక్ పింక్ , లావెండర్ షేడ్స్‌తో కూడిన అందమైన అనార్కలి గౌను ధరించడం మంచిది.వృశ్చికరాశి వారు ముదురు ఎరుపు లేదా నలుపు రంగులతో అలంకరించిన చీరను ధరించాలి.
అలాగే ధనస్సు రాశి వారు బంధిని ప్రింట్ లెహంగా ను ధరించడం మంచిది.మకర రాశి( Capricorn ) వారు ఆకుపచ్చ లేదా మెరూన్ రంగు గల దుస్తులను ధరించాలి.
కుంభ రాశి వారు సాంప్రదాయ రంగుల దుస్తులను ధరించాలి.మీన రాశి ( Pisces )వారు సి గ్రీన్ లేదా లైట్ బ్లూ రంగు దుస్తులను ధరించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.