ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ సృష్టించిన విధ్వంసం ఎవరు మర్చిపోలేనిది. 2019 వ సంవత్సరంలో నవంబర్ మాసంలో చైనా లో వైరస్ కేవలం కొద్ది నెలల్లోనే ప్రపంచం మొత్తం విస్తరించి అన్ని దేశాల ఆర్ధిక పరిస్థితిని చిన్నాభిన్నం చేసింది.
అంతేకాకుండా లక్షలాది మందిని పొట్టన పెట్టుకోవడం జరిగింది.ఈ వైరస్ దెబ్బకి కువైట్ ప్రభుత్వం ఇతర దేశస్తులు అప్పట్లో పంపించే విధంగా నిర్ణయాలు కూడా తీసుకోవటం మనకందరికీ తెలిసిందే.
ఇదిలా ఉంటే తాజాగా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది కువైట్ ప్రభుత్వం.మేటర్ లోకి వెళ్తే కువైట్ దేశం లో వైరస్ ప్రభావం ఉన్న కొద్ది ఇటీవల పెరుగుతున్న నేపథ్యంలో అంతర్జాతీయ పర్యాటకుల పై నిషేధం విధించడం జరిగింది.
అంతేకాకుండా ప్రభుత్వం జారీ చేసిన కరోనా నిబంధనలను దేశంలో ఎవరైనా అతిక్రమిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని తెలిపింది.ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగులు అయినా కరోనా నిబంధనలు ఉల్లంఘించినా వారిపై కఠిన చర్యలు తప్పవని.
ఉల్లంఘించినట్లు రుజువు అయితే వారి నెల జీతంలో నుండి పదిహేను రోజుల జీతాన్ని కట్ చేయడం జరుగుతుందని ఆ దేశ ప్రభుత్వం సరికొత్త వార్నింగ్ ఇచ్చింది.
.