మన సినిమాలలో కథకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో, అంతే ప్రాధాన్యం పాటలకు కూడా ఉంటుంది.ఏదైన సినిమా పాటలు హిట్ అయితే, సినిమా కూడా ఖచ్చితంగా హిట్ అవుతుంది అనే భావన మన సినీ పరిశ్రమలో ఉంది.
మరి పాటలు బాగుండాలంటే సాహిత్యం చాలా ముఖ్యం.మరి అంతటి ప్రాధాన్యం ఉన్న సాహిత్యాన్ని అందించటానికి మన రచయతలు ఎంత కష్టపడతారో ఊహించారా? ఆత్రేయ, సిరివెన్నెల సీతారామ శాస్త్రి, వేటూరి సుందరరామమూర్తి వంటి ఎందరో మహానుభావులు మనకు గుండెకు హత్తుకునే సాహిత్యాన్ని అందించటానికి ఎన్ని నిద్రలు లేని రాత్రులు గడిపారో ఎప్పుడైనా ఆలోచించారా.
ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో నెంబర్ 1 రచయిత చంద్రబోస్( Chandra Bose ) గారు.“మౌనంగానే యదగమని” వంటి స్ఫూర్తిని నింపే పాటల తో పాటు “బేబీ హి లవ్స్ యూ” ( Baby He Loves You )వంటి లవ్ బీట్స్ వరకు…ఎటువంటి పాటనైనా అలవోకగా రాయగల సమర్ధుడు.ఈయన ఆర్ ఆర్ ఆర్ చిత్రంలో నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు అందుకున్న విషయం మనందరికీ తెలిసినదే.తాజాగా ఈయన ఒక ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఒక్కో రచయిత ఒక పాట రాయటడానికి పడే వేదన ఎలా ఉంటుందో చెప్పుకొచ్చారు.“అప్పట్లో రచయతలు పాటలు రాయటానికి హోటల్ రూమ్ బుక్ చేసుకొని, చేతిలో విస్కీ గ్లాస్, మరో చేతిలో సిగరెట్ పట్టుకొని రోజులు తరబడి కూర్చునే వారట? నిజమేనా?” అని ప్రశ్నించగా దానికి చంద్రబోస్ ఒక్కో రైటర్ కి ఒక్కో శైలి ఉంటుందని అన్నారు.
అందరు అలాగే రాస్తారు అని అనలేం కానీ కొందరికి ఆ అలవాటు ఉండవచ్చు అన్నారు.ప్రతి ఒక్క రచయిత తాను రాసే ప్రతి పాటకు తన ఆయుష్షు ని ధారపోసి ప్రాణ ప్రతిష్ట చేస్తారని అన్నారు.ఆత్రేయ ( atreya )గారిని ఉదాహరణగా చెప్తూ… “ఆత్రేయ గారు కొన్ని సార్లు పాటలు రాయటానికి మంచం మీద పడుకొని తీవ్రంగా ఆలోచించేవారట.
కేవలం కాళ్ళను మాత్రమే కదుపుతూ, కళ్ళు మూసుకొని కొన్ని గంటల పాటు అలాగే మంచం పై ఉండిపోయేవారట” అని అన్నారు.ప్రేమ్ నగర్, ఆకలి రాజ్యం వంటి సూపర్ హిట్ సినిమాలకు సాహిత్యం అందించారు ఆత్రేయ.