టెస్ట్ మ్యాచ్ లో ఐదు రోజులు వరుసగా బ్యాటింగ్ చేసిన క్రికెటర్లు వీరే..!

యాషెస్( Ashes Test Series ) తొలి టెస్ట్ లో ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా( Usman Khawaja ) ఓ సరికొత్త రికార్డు సాధించాడు.టెస్ట్ మ్యాచ్లో ఐదు రోజులు వరుసగా బ్యాటింగ్ చేసిన రెండవ ఆస్ట్రేలియా క్రికెటర్ గా( Australia Cricketer ) నిలిచాడు.

 Cricketers Who Have Batted For Five Consecutive Days In A Test Match Usman Khawa-TeluguStop.com

అంతర్జాతీయ క్రికెట్లో ఈ అరుదైన ఘనత సాధించిన ఆటగాళ్లలో 13వ ఆటగాడిగా నిలిచాడు.యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించడానికి ఉస్మాన్ ఖవాజా కీలక పాత్ర పోషించాడు.

ఉస్మాన్ ఖవాజా ఈ మ్యాచ్లో 518 బంతులను ఎదుర్కొని 206 పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు తొలి ఇన్నింగ్స్ లో మొదటిరోజు 393/8 వద్ద డిక్లేర్ చేసింది.

దీంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో మొదటి రోజు నాలుగు ఓవర్లు బ్యాటింగ్ చేసింది.రెండవ రోజు ఉస్మాన్ ఖవాజా 126 పరుగులు చేసి అజయంగా నిలిచాడు.

మూడవరోజు 15 పరుగులు జోడించి 141 పరుగుల వద్ద అయ్యాడు.

ఇక నాలుగో రోజు రెండు ఇన్నింగ్స్ ప్రారంభించి 273 పరుగులకు ఇంగ్లాండ్ ఆల్ అవుట్ అయ్యింది.

దీంతో మళ్లీ అదే రోజు ఉస్మాన్ ఖవాజా 34 పరుగులు చేసి నాట్ అవుట్ గా నిలిచాడు.ఇక చివరి రోజు అంటే ఐదవరోజు బ్యాటింగ్ చేసి మరో 31 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.

అంటే ఈ మ్యాచ్ లో ఐదు రోజులు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు బ్యాటర్ గా నిలిచాడు.

Telugu Alviro Petersen, Andrew Flintoff, Ashes, Australia, Days, Cricketers, Eng

ఈ ఘనత సాధించి జాబితాలో ముందు నిలిచిన ఆటగాళ్లు వీరే:

మోత్గనల్లి జైసింహ (భారత్‌) వర్సెస్‌ ఆస్ట్రేలియా – 1960

జియోఫ్రీ బాయ్‌కాట్ (ఇంగ్లండ్) వర్సెస్‌ ఆస్ట్రేలియా – 1977

కిమ్ హ్యూస్ (ఆస్ట్రేలియా) వర్సెస్‌ ఇంగ్లండ్ – 1980

అలన్ లాంబ్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ వెస్టిండీస్ – 1984

Telugu Alviro Petersen, Andrew Flintoff, Ashes, Australia, Days, Cricketers, Eng

రవిశాస్త్రి (భారత్‌) వర్సెస్‌ ఇంగ్లాండ్ – 1984

అడ్రియన్ గ్రిఫిత్ (వెస్టిండీస్) వర్సెస్‌ న్యూజిలాండ్ – 1999

ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ భారతదేశం – 2006

అల్విరో పీటర్సన్ (దక్షిణాఫ్రికా) వర్సెస్‌న్యూజిలాండ్ – 2012

Telugu Alviro Petersen, Andrew Flintoff, Ashes, Australia, Days, Cricketers, Eng

చెతేశ్వర్ పుజారా (భారత్‌) వర్సెస్‌ శ్రీలంక – 2017

రోరీ బర్న్స్ (ఇంగ్లాండ్) వర్సెస్‌ ఆస్ట్రేలియా – 2019

క్రైగ్ బ్రాత్‌వైట్ (వెస్టిండీస్) వర్సెస్‌ జింబాబ్వే – 2023

టాంగెనరైన్ చందర్‌పాల్ (వెస్టిండీస్) వర్సెస్‌ జింబాబ్వే – 2023

ఉస్మాన్ ఖవాజా (ఆస్ట్రేలియా) వర్సెస్‌ ఇంగ్లాండ్ – 2023*

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube