జనసేన అధినేత పవన్ కల్యాణ్( Pawan kalyan ).ఏపీలో వారాహి యాత్ర నిర్వహిస్తున్న ఆయన ఒక్కో రోజు ఒక్కో విధంగా మాట్లాడుతున్నాడు.
నిన్న మాట్లాడిన మాట ఈరోజు ఉండదు.ఈ రోజు మాట రేపు ఉండదు.
లేని శౌర్యాన్ని ప్రదర్శిస్తూ సోయలేని ప్రకటనలు చేస్తున్నారంటూ అభిమానులు సైతం విస్తుపోతున్నారట.ఇటీవల ఆయన చేస్తున్న వ్యాఖ్యలను చూస్తే పవన్ పై ఉన్న భ్రమలన్నీ తొలగిపోతున్నాయని విశ్లేషకులు చెబుతున్నారని తెలుస్తోంది.
సినిమా హీరోగా నటించే పవన్ రాజకీయాల్లో గాలిలో కత్తులు తిప్పుతూ యుద్ధం చేస్తున్నాడు.అభిమానుల ఇష్టాన్ని వాడుకుంటూ డాంభికాలు ప్రదర్శిస్తున్నారని కొందరు విమర్శిస్తున్నారు.
గతంలో నాయకులకు సంకెళ్లు వేసి రోడ్ల మీద నడిపిస్తూ కొట్టుకుంటూ వెళ్తానంటూ పవన్ ఓ ప్రకటన చేశారు.దీంతో ఆయనలో నాయకుని లక్షణాలు ఏమీ లేవని సినిమా తరహాలో డైలాగ్స్ చెప్తున్నారంటూ కొద్ది గొప్ప అభిమానం ఉన్నవాళ్లు కూడా విమర్శలు గుప్పించారు.

అంతేకాదు తాజాగా ఎవరి దగ్గరా లాలూచీ లేకుండా గత కొన్నేళ్లుగా నిస్వార్థంగా కాపుల సంక్షేమమే ధ్యేయంగా ఉద్యమాన్ని నడిపిస్తున్న కీలక నేత ముద్రగడ పద్మనాభం వంటి వ్యక్తిని కించపరుస్తూ మాట్లాడారు పవన్.దీంతో ఆయన ఎప్పటికీ చంద్రబాబు డైరెక్షన్ లో ప్యాకేజీ స్టార్ గానే వ్యవహరిస్తున్నారనే వాదనలు వినిపించాయి.టీడీపీ ప్రభుత్వం( TDP ) అధికారంలో ఉన్న సమయంలో ముద్రగడ పద్మనాభం కుటుంబాన్ని దుర్భాషలాడుతూ పోలీసులు అరెస్ట్ చేశారు.ఆ సమయంలో టీడీపీలో భాగస్వామిగా ఉన్న పవన్ ఆనాడు ముద్రగడకు ఎందుకు దన్నుగా నిలబడలేదు.
కాపుల కోసం ఇప్పుడు ఇంతలా తాపత్రయ పడుతున్న జనసేనాని ఆనాడు చంద్రబాబు( Chandrababu Naidu )ను ఎందుకు ప్రశ్నించలేదనేది పలువురి మదిని తోలుస్తున్న ప్రశ్న.మచ్చ లేని ఉద్యమ నేతగా రాణిస్తూ.
ఏ నాడు స్వలాభం కోసం కులాన్ని వాడుకోని ముద్రగడ( Mudragada Padmanabham ), ఎప్పుడు ఉద్యమానికి అవసరమైన మేమున్నామంటూ అన్ని విధాలుగా అండదండగా నిలిచిన ద్వారంపూడి వంటి వ్యక్తులను టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు పవన్ ను ప్రజల్లో మరింత చులకన చేశాయని పలువురు చెబుతున్నారు.

గతంలో ఓడిపోయినా ఇంకా ప్రజల కోసమే యుద్ధం చేస్తున్నానని చెబుతున్న పవన్ ఎమ్మెల్యే చేయండి.సీఎంను చేయండి అంటూ కోరుతున్నారు.ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చానంటూ, కాపుల కోసం ఏమైనా చేస్తానంటూ మాయమాటలు చెబుతున్నారని, ఓట్లను అమ్ముకోవడానికే ఇంతలా తాపత్రయపడుతున్నారన్న విషయం కాస్త మెచ్యూరిటీ ఉన్న వాళ్ల అందరికీ అర్థం అవుతుందని పలువురు అంటున్నారు.
అయినా రాష్ట్రానికి, ప్రజలకు మంచి చేసేది ఎవరూ.ముంచేది ఎవరూ అని తెలుసుకోలేనంత స్థితిలో ఇప్పుడు ప్రజలు లేరని విజ్ఞులు చెబుతున్న మాట.







