హెల్మెట్ వల్ల జుట్టు రాలిపోతుందా? అయితే ఇలా చేయండి!

హెల్మెట్ ( Helmet )అనేది ఇక్కడ ప్రతి వాహనదారుడికి తప్పనిసరి.దాని ఉపయోగం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

 Can Helmets Cause Hair Loss But Do This-TeluguStop.com

అందరికీ తెలిసిందే.పోలీసులు కూడా హెల్మెట్ విషయంలో పదే పదే వాడమని ఎందుకు చెబుతారంటే, రోడ్డుపైన జరుగుతున్న ప్రమాదాలను అరికట్టడానికే.

అయితే ఎన్ని చెప్పినా నేటి యువత హెల్మెట్ వాడడానికి అంతగా ఇష్టపడడం లేదు.దానికి వారు చెబుతున్న ప్రధాన కారణం… జుట్టు రాలిపోతుందని.

వినడానికి విడ్డురంగా వున్నా ఇది నిజమని అందరికీ తెలిసిందే.

అయితే అందులో నిజం లేకపోలేదు.

ఆ సమస్య ఎదుర్కుంటున్న వాళ్లు మనచుట్టూ చాలా మందే వున్నారు.అయితే ప్రాణాలమీద తీపిఉన్నవారు ప్రాణ సంరక్షణ కోసం హెల్మెట్ పెట్టుకోవడం అయితే చాలా ముఖ్యం.

హెల్మెట్ తీయగానే చెమట ఎక్కువగా రావడం, బ్యాక్టీరియా, నాణ్యత లేని హెల్మెట్లు వాడటం వల్ల కూడా ఈ సమస్య అనేది మొదలవుతుంది.ఈ నేపథ్యంలో హెల్మెట్ పెట్టుకున్నపుడు జుట్టు ఎలా కాపాడుకోవాలో తెలుసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం.

లేదంటే జుట్టు రాలే సమస్య మరింత ఎక్కువకావడం ఖాయం అని నిపుణులు చెబుతున్నారు.

Telugu Aloe Vera, Bike, Dandruff, Care, Tips, Healthy, Helmet-Latest News - Telu

ఈ కింది జాగ్రరత్తలు తీసుకుంటే ఆ సమస్యను అధిగమించవచ్చు.హెల్మెట్ ధరించేముందు లోపల ఒక కాటన్ క్లాత్ పెట్టుకొని పెట్టుకుంటే బావుంటుంది.దీనివల్ల హెల్మెట్ లోపలి భాగం వల్ల జుట్టు దెబ్బతినదు.

చెమట కూడా పీల్చుకుంటుంది.దూర ప్రయాణాలు చేస్తున్నపుడు నాణ్యత కలిగిన బైకర్స్ మాస్క్ వాడండి.

Telugu Aloe Vera, Bike, Dandruff, Care, Tips, Healthy, Helmet-Latest News - Telu

జుట్టు తడిగా ఉన్నప్పుడు మాత్రం హెల్మెట్ పెట్టుకోకండి.దానివల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్లు మొదలై చుండ్రు( Dandruff ), దురద సమస్యతో పాటూ జుట్టు కూడా రాలుతుంది.వారానికోసారి తప్పకుండా హెల్మెట్ లోపల శుభ్రం చేసుకోండి.లోపల ఉండే కుషనింగ్ మీద ఉన్న మురికి తొలగించండి.హెల్మెట్ ని గాలి తగిలే చోట పెట్టండి.లేదంటే ఫంగస్ వల్ల జుట్టుకు హాని జరుగుతుంది.

వేరే వాళ్ల హెల్మెట్లు వాడకపోవడమే ఉత్తమం.ఒకవేళ వాడాల్సి వస్తే, లోపల తప్పకుండా ఏదైనా క్లాత్ పెట్టుకోండి.

రెండ్రోజులకోసారి నూనెతో తల మర్దనా చేసుకోవడం వల్ల రక్త ప్రసరణ పెరుగుతుంది.తలస్నానం చేసే ముందు ఒక 10 నిమిషాలు కలబంద గుజ్జు( Aloe vera ) లేదా అలోవెరా జెల్ తలకు రాసుకోండి.

చుండ్రు సమస్య తగ్గుతుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube