చెట్లు మొక్కలను పూజించడం హిందూ ధర్మం( Hindu Dharma )లో పురాతన సంప్రదాయం అని చాలామందికి తెలుసు.హిందూ సంస్కృతిలో మామిడి చెట్టు( Mango tree )కు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
మామిడి పండు ను పండ్ల రాజుగా కూడా చెబుతూ ఉంటారు.అలాగే దీనిని సహజ ఆర్థిక వనరుకు చిహ్నంగా పరిగణిస్తారు.
అంతేకాకుండా మామిడి ఆకులు, పండ్ల బెరడు ఆయుర్వేద గృహ వైద్యంలో కూడా ఉపయోగిస్తారు.మామిడి చెట్టును పూజిస్తారని దీని ఆకులతో చేసిన తోరణాన్ని పండుగలు, శుభకార్యాల సమయంలో గుమ్మాలకు కడతారు.
అంతేకాకుండా పూజా సమయంలో కలశం ఏర్పాటు చేసి ఆ కలశం లో మామిడి ఆకులను ఉపయోగిస్తారు.

మామిడి ఆకులు, మామిడి పండ్లను వివిధ రకాల ఉపవాసాలు,( fasting ) పూజలలో ఉపయోగిస్తారు.అదే సమయంలో మామిడి ఆకుల సహాయంతో ఎవరైనా సరే అనేక రకాల సమస్యల నుంచి బయటపడవచ్చు.మామిడి ఆకుల తోరణం తో కలిగే శుభ పరిమాణాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా చెప్పాలంటే ఇంటి ప్రధాన ద్వారం పై మామిడి ఆకులను తోరణం గా కట్టడం వల్ల మీ ఇంటిని చెడు దృష్టి నుంచి రక్షించుకోవచ్చు.శుభ కార్యాలయలలో మామిడి ఆకులను ఉపయోగించడం వల్ల మీకు విజయం, ఆనందం, శాంతి లభిస్తుంది.

ఇంకా చెప్పాలంటే ఇంట్లో మామిడి ఆకులను పూజా సమయంలో లేదా గుమ్మానికి తోరణంగా ఉపయోగించడం ద్వారా సంపద, శ్రేయస్సును పొందవచ్చు.మామిడి ఆకులతో దేవాలయం లేదా ప్రార్థన స్థలాన్ని అలంకరించడం ద్వారా ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగిస్తారు.ఇంకా చెప్పాలంటే మామిడి ఆకులను వివాహ జీవితంలో, సంతోషం, శాంతి, శ్రేయస్సు తీసుకురావడానికి పవిత్రమైన పనులలో కూడా ఉపయోగిస్తారు.ఇంకా చెప్పాలంటే మామిడి ఆకుల్లో విటమిన్ ఏ( , Vitamin A ) విటమిన్ సి కూడా ఉంటాయి.
ఇవి మీ కళ్ల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.మామిడి ఆకులు శీతలీకరణ ప్రభావాన్ని కలిగి ఉంటాయి.ఇవి చల్లదనాన్ని అందించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి.