సాధారణంగా ఒక్కోసారి పెదాలు నల్లగా( Black lips ) కాంతిహీనంగా మారుతుంటాయి.ఎండల ప్రభావం, డిహైడ్రేషన్, కెమికల్స్ ఎక్కువగా ఉండే లిప్ స్టిక్స్ వాడడం, ఒంట్లో అధిక వేడి, పెదాల సంరక్షణ లేకపోవడం తదితర కారణాల వల్ల లిప్స్ అనేవి డార్క్ గా మారుతుంటాయి.
అయితే అటువంటి పెదాలని రిపేర్ చేసే ఇంటి చిట్కాలు ఎన్నో ఉన్నాయి.వాటిలో మోస్ట్ పవర్ ఫుల్ టిప్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

రెమెడీ 1: ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ షుగర్ పౌడర్( Sugar powder ) వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ బియ్యం పిండి, చిటికెడు పసుపు ( Rice flour, pinch of turmeric )మరియు వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని బాగా మిక్స్ చేయాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసి ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.ఆపై వాటర్ తో శుభ్రంగా పెదాలను క్లీన్ చేసుకోవాలి.ఈ సింపుల్ రెమెడీ పెదాలపై పేరుకుపోయిన మురికి, మృతకణాలను తొలగిస్తుంది.నలుపును పోగొట్టి పెదాలకు కొత్త మెరుపు ను జోడిస్తుంది.
పెదాలు అందంగా కాంతివంతంగా మెరిసేలా ప్రోత్సహిస్తుంది.ఈ రెమెడీతో పెదాల పగుళ్ళ సమస్యకు కూడా గుడ్ బై చెప్పొచ్చు.

రెమెడీ 2: ఒక బౌల్ తీసుకుని అందులో వన్ టీ స్పూన్ బియ్యం పిండి వేసుకోవాలి.అలాగే వన్ టీ స్పూన్ తేనె( honey ) మరియు వన్ టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి బాగా మిక్స్ చేసుకోవాలి.ఈ మిశ్రమాన్ని పెదాలకు అప్లై చేసుకుని ఒక నిమిషం పాటు సున్నితంగా స్క్రబ్బింగ్ చేసుకోవాలి.ఆపై మరొక ఐదు నిమిషాల పాటు పెదాలను ఆరబెట్టుకుని అప్పుడు వాటర్ తో శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.
వారానికి రెండుసార్లు ఈ రెమెడీని కనుక పాటిస్తే డార్క్ లిప్స్ కు బై బై చెప్పవచ్చు.ఈ రెమెడీ సైతం పెదాల నలుపును సమర్థవంతంగా వదిలిస్తుంది.లిప్స్ ను సూపర్ షైనీ గా మారుస్తుంది.ఇక ఈ రెమెడీస్ ను పాటించడంతో పాటు వాటర్ ఎక్కువగా తీసుకోండి.
హెల్తీ డైట్ మెయింటైన్ చేయండి.రోజుకు రెండు మూడుసార్లు కచ్చితంగా సన్ ప్రొటెక్షన్ ఉన్న లిప్ బామ్ ఉపయోగించండి.







