మారుతున్న కాలానికి అనుగుణంగా మనిషి యొక్క ఆలోచన విధానం మారింది.ఆకాశంలో విహరించాలనే కల 1907లో సఫలీకృతమైంది.
రైట్ బ్రదర్స్ ఆవిష్కరించిన విమానంతో ఆకాశంలో మానవుడు విహరించగలడనే స్వప్నానికి ఆశలు చిగురించేలా చేశాయి.అలా ప్రస్తుతం ఉన్న విమానాలు రూపాంతం చెందడానికి కొన్నేళ్ల సమయం పట్టింది.
ఇప్పటికే వేలాది మంది ప్రయాణికులు దేశీయంగా, ప్రపంచవ్యాప్తంగా విమానాల్లో ప్రయాణాలు చేస్తున్నారు.టెక్నాలజీ అందుబాటులోకి వచ్చినా.
ఇంకా కొత్తదనం కోసం ప్రయత్నించడంలో మనిషిలో జిగ్నాష ఎప్పుడూ పోలేదు.ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఎయిర్ ఫ్యూయల్‌తో వాతావరణ కాలుష్యం పెరుగుతోంది.
వాతావరణంలో కాలుష్యం పెరగడంతో.దీనికి నివారించేందుకు చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలపై మొగ్గు చూపుతున్నారు.ఈ దిశగా ఇప్పటికే ఎలక్ట్రిక్ రైళ్లు, బైక్‌లు, కార్లు, బస్సులు అందుబాటులోకి వచ్చాయి.
ఇప్పుడు ఎలక్ట్రిక్ విమానాన్ని కూడా రూపొందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.దీనిపై బ్రిటన్‌కు చెందిన వర్టికల్ ఏరోస్పేస్ కూడా ఆమోదం తెలిపింది.
ఎలక్ట్రిక్ విమానాలను రూపొందించవచ్చని పేర్కొంది.ఈ క్రమంలో 2016లో వెర్టికల్ ఏరోస్పెస్ ఎలక్ట్రిక్ ఏవియేషన్‌ను స్టీఫెన్ పిట్‌జ్‌ప్యాట్రిక్ ప్రారంభించారు.
ఈ సంస్థలో ఎలక్ట్రిక్ విమానాల తయారీపై ప్రయోగాలు జరిగాయి.
వీరి ప్రయోగించిన ఫలితాలు కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నాయి.ఇప్పటికే ఎలక్ట్రిక్ వీఎక్స్4 ప్రోటోటైప్ పేరుతో మొట్టమొదటి ఎయిర్‌బోర్న్ పరీక్షను నిర్వహించింది.ఈ పరీక్షలో విజయం సాధించింది.
దీంతో వర్టికల్ ఏరోస్పేస్ గత 20 ఏళ్లలో కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ తో బయల్దేరిన మొదటి బ్రిటీష్ కంపెనీగా అవతరించిందని స్టీఫెన్ ఫిట్‌జ్‌పాట్రిక్ అన్నారు.తాను రూపొందించిన ఈ ఎలక్ట్రిక్ విమానం పూర్తిగా కార్బన్ రహిత విమానంగా పేర్కొన్నారు.2050 నాటికి కాలుష్య రహిత విమానయానం రూపొందించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకుంది.దీన్ని తమ సంస్థ నిజం చేస్తుందని స్టీఫెన్ తెలిపారు.2025 నాటికి వీఎక్స్-4 విమానం ఫ్లైట్ పర్మిట్ అనుమతి పొందుతామని ఆశాభావం వ్యక్తం చేశారు.