తెలంగాణ సీఎంగా రేవంత్ రెడ్డి మరి కాసేపటిలో ప్రమాణస్వీకారం చేయనున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఏపీలో వెలిసిన బ్యానర్లు తీవ్ర కలకలం సృష్టిస్తున్నాయి.
వీరులపాడులో టీడీపీ అధినేత చంద్రబాబు, ఎన్టీఆర్ తో పాటు రేవంత్ రెడ్డి ఫొటోలు ఉన్న బ్యానర్లు దర్శనమిస్తున్నాయని సమాచారం.గ్రామ టీడీపీ అభిమానులు ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారని తెలుస్తోంది.
అయితే టీడీపీ నేతలు రేవంత్ రెడ్డి బ్యానర్లు పెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.







