హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన జూబ్లీహిల్స్ పబ్ గ్యాంగ్ రేప్ కేసులో విచారణ కొనసాగుతోంది.మైనర్ బాలికపై ఐదుగురు మైనర్లతో పాటు ఓ యువకుడు సామూహిక అత్యాచారానికి పాల్పడిన సంగతి తెలిసిందే.
ఈ కేసులో మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు.
తాజాగా ఈ కేసుకు సంబంధించి పోలీసులు నాంపల్లి కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు.
గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డ ఐదుగురు మైనర్లను మేజర్లుగా గుర్తించాలని పిటిషన్ లో కోరారు.నిందితులందరికీ మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో నాంపల్లి కోర్టు పిటిషన్ ను విచారణకు స్వీకరించింది.







