ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది.ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది.
ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకారం, ఢిల్లీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ డిసెంబర్ 4వ తేదీన నిర్వహించబడుతుంది.ఎన్నికల ఫలితాలు డిసెంబర్ 7న ప్రకటించనున్నారని ఎన్నికల సంఘం పేర్కొంది.
ఈ మేరకు నవంబర్ 7న నోటిఫికేషన్ విడుదల కానుంది.నవంబర్ 14 వరకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ కొనసాగనుంది.
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ నవంబర్ 19 వరకు ఉండనుందని ఎన్నికల సంఘం ప్రకటనలో పేర్కొంది.ఈ క్రమంలో డీలిమిటేషన్ ప్రక్రియ పూర్తి అయిందని ఎస్ఈసీ తెలిపింది.
అదేవిధంగా పోలిలంగ్ కేంద్రాలను రీ డ్రా చేసినట్లు వెల్లడించింది.







