మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో విచారణ జరుగుతోంది.ఈ క్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు.
అవినాశ్ రెడ్డితో పాటు ఉదయ్ కుమార్, దేవిరెడ్డి శివ శంకర్ రెడ్డి, సునీల్ యాదవ్, గంగిరెడ్డి ఉమాశంకర్ రెడ్డి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు.అయితే హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.