భారత్ లో కరోనా విజృంభణ కొనసాగుతోంది.రోజు రోజుకు పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది.
ఈ క్రమంలో కోవిడ్ వ్యాక్సిన్ సరఫరాపై కేంద్రం చేతులెత్తేసిందని తెలుస్తోంది.కరోనా వ్యాప్తి, వ్యాక్సిన్ సరఫరాపై అన్ని రాష్ట్రాలతో మాండవియా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన సంగతి తెలిసిందే.
కరోనా కేసుల వ్యాప్తి నేపథ్యంలో టీకాను సరఫరా చేయాలని తెలంగాణ ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సహా ఇతర రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి.దీనిపై స్పందించిన కేంద్రం వ్యాక్సిన్ ను సొంతంగా కొనుగోలు చేసుకోవాలని రాష్ట్రాలకు సలహా ఇచ్చిందని సమాచారం.
అయితే 15 లక్షల డోసులు సరఫరా చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.







