ఏపీ ప్రభుత్వం ఇవాళ మరోసారి అంగన్వాడీలతో చర్చలు జరపనుంది.సాయంత్రం 5 గంటలకు రావాలని అంగన్వాడీలకు సర్కార్ పిలుపునిచ్చింది.

సెక్రటేరియట్ లో కేబినెట్ సబ్ కమిటీతో అంగన్వాడీలు చర్చలు జరపనున్నారు.అయితే గత పదిహేను రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే.సుమారు పదకొండు రకాల హామీలను వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని అంగన్వాడీలు డిమాండ్ చేస్తున్నారు.కాగా తమ డిమాండ్ల సాధన కోసం ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చలు విఫలం అయిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే మరోసారి ప్రభుత్వంతో అంగన్ వాడీలు చర్చలు జరపనున్నారు.







