తిరుపతి జిల్లాలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం సృష్టిస్తుంది.నెహ్రునగర్ లో ముగ్గురు అమ్మాయిలతో పాటు ఇద్దరు అబ్బాయిలు అదృశ్యమైయ్యారు.
వీరంతా జిల్లాలోని అన్నమయ్య హైస్కూల్ లో టెన్త్ క్లాస్ విద్యార్థులుగా గుర్తించారు.ట్యూషన్ కు వెళ్లి తిరిగి రాకపోవడంతో బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
విద్యార్థుల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.ఇందులో భాగంగా కనిపించకుండా పోయిన విద్యార్థుల కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.







