'ఉస్తాద్ భగత్ సింగ్' రిలీజ్ డేట్ అనౌన్స్.. ఎప్పుడంటే?

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబో అంటే టాలీవుడ్ లో ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎందుకు అంత క్రేజ్ అంటే గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది ఈ కాంబో లోనే కావడంతో మరోసారి ఈ కాంబో ఎప్పుడు వస్తుందా అని పవర్ స్టార్ ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తున్నారు.

 Pawan Kalyan Ustaad Bhagat Singh Glimpse And Release Date Will Be Announced Deta-TeluguStop.com

మరి ఎట్టకేలకు ఎన్నో ఏళ్ల తర్వాత ఈ ఇద్దరి కాంబోలో మరో సినిమా రాబోతుంది.పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ”ఉస్తాద్ భగత్ సింగ్” (Ustaad Bhagat Singh).

ఇన్నాళ్లకు మళ్ళీ ఈ బ్లాక్ బస్టర్ కాంబో రిపీట్ అవుతుండడంతో ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఈగర్ గా ఎదురు చూస్తున్నారు.

ఇక ఈ సినిమా షూట్ స్టార్ట్ అయ్యి మొదటి షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది.ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా పవర్ స్టార్ మరోసారి ఖాకీ చొక్కా వేయడంతో మరింత హైప్ పెరిగింది.ఇది పక్కన పెడితే తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ పై మరోసారి ఇంట్రెస్టింగ్ రూమర్ నెట్టింట వైరల్ అవుతుంది.

మే 11న ఈ సినిమా నుండి గ్లింప్స్ ను రిలీజ్ చేసేందుకు మాసివ్ ప్లాన్ చేస్తున్నట్టు టాక్ వచ్చిన విషయం తెలిసిందే.

మరి అదే రోజు గ్లింప్స్ తో పాటు మూవీ రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసే అవకాశం ఉందని అంటున్నారు.గబ్బర్ సింగ్ మే 11నే రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో అదే రోజు గ్లింప్స్ రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేయాలని గట్టి ప్లాన్ లో మేకర్స్ ఉన్నారని తెలుస్తుంది.ఇదే నిజమైతే ఫ్యాన్స్ కు పండుగే.

ఇక మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా 2024లో ప్రేక్షకుల ముందుకు రానుంది.అలాగే శ్రీలీల (SreeLeela) హీరోయిన్ గా నటిస్తుండగా.దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube