మంచు మోహన్ బాబు( Mohan Babu ) వారసురాలుగా ఇండస్ట్రీలోకి మంచు లక్ష్మి నటిగా ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే.ఇలా పలు సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నటువంటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా ముందు వరుసలో ఉంటారు.
ఈ క్రమంలోనే ఈమె ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లలు కూడా ప్రైవేట్ పాఠశాలలలో చదివే పిల్లలకు దీటుగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి ఏడాది స్కూళ్ళను దత్తత తీసుకొని ఆ స్కూల్లో చదివే పిల్లలకు అన్ని సదుపాయాలను సమకూరుస్తున్న విషయం మనకు తెలిసిందే.ఈ క్రమంలోనే టీచ్ ఫర్ చేంజ్ అనే( Teach For Change ) కార్యక్రమాన్ని ప్రారంభించిన మంచు లక్ష్మీ గత ఏడాది యాదాద్రి భువనగిరి ప్రాంతాలలో సుమారు 56 పాఠశాలలను దత్తత తీసుకున్నారు.
ఈ పాఠశాలలో చదివే పిల్లలందరికీ కూడా అన్ని రకాల సౌకర్యాలను సమకూరుస్తూ చదువులలో పిల్లలని ఎంతో ప్రోత్సహిస్తూ ఉన్నారు.ఈ క్రమంలోనే ఈ ఏడాది మరో 30 పాఠశాలలను ఈమె దత్తత( Adopt ) తీసుకొని మంచి మనసు చాటుకున్నారు.ఇలా కొన్ని జిల్లాలలో పాఠశాలలను దత్తత తీసుకొని పాఠశాలలలో చదివే పిల్లలకు డిజిటల్ చదువులను ఏర్పాటు చేస్తున్నారు.ఇలా చేయటం వల్ల పిల్లలలో విద్యా ప్రమాణాలు పెరుగుతాయని భావించిన మంచు లక్ష్మి ప్రతి ఏడాది పెద్ద ఎత్తున స్కూల్స్ దత్తత తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఈ ఏడాది జోగులాంబ గద్వేల్ జిల్లా( Jogulamba Gadwal ) నుంచి 30 పాఠశాలలను ఎంపిక చేసి ఆ పాఠశాలకు కావలసిన సదుపాయాలన్నింటిని ఏర్పాటు చేయనున్నారు.ఈ క్రమంలోనే గద్వేల్ జిల్లా కలెక్టర్ తో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం ఈమె ఈ విషయాలను ప్రకటించారు.ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన మంచు లక్ష్మి ప్రైవేట్ విద్యార్థులతో సమానంగా ఇంగ్లీష్ భాషలో రాయడం, చదవం, రావాలి అన్నారు. ఇక ఈ కార్యక్రమం ద్వారా మూడు స్థాయిలలో విద్యాబోధన ఉంటుందని ఈమె తెలిపారు.
ఒకటి నుండి ఐదు తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్ లో బోధన ఉంటుందని తెలియజేశారు.ఇక తాము ఎంపిక చేసుకున్నటువంటి పాఠశాలలకు టీవీ, వాల్‌పేయింటింగ్, కార్పెట్స్, బోధన సామగ్రి సమకూరుస్తామన్నారు.30 పాఠశాలల్లో వసతులు కల్పించనున్నట్లు అగ్రిమెంట్‌పై సంతకం చేశారు.