ఏపీ సీఎం జగన్ పై టీడీపీ అధినేత పయ్యావుల కేశవ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.జగన్ ది శ్రీలంక ఎకనామిక్స్.
పాకిస్థాన్ పాలిటిక్స్ అని విమర్శించారు.
జగన్ ఒక్కసారి నేల మీద నడిస్తే ప్రజలు ఇబ్బంది పడుతున్నారని పయ్యావుల మండిపడ్డారు.
జగన్ హెలికాప్టర్ తో గాల్లో ప్రయాణిస్తేనే అందరికీ మంచిదన్నారు.జగన్ పేదరికాన్ని కాదు.
పేదలను నిర్మూలిస్తున్నారని ఆరోపించారు.వచ్చే ఎన్నికల్లో జగన్ క్యాష్ వార్ చేసేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.చంద్రబాబు హయాంలో క్యాపిటల్ ఎక్స పెండిచర్ 12 శాతం ఉంటే జగన్ ప్రభుత్వంలో 6.7 శాతం మాత్రమే ఉందని పయ్యావుల ఎద్దేవా చేశారు.