ఈ మధ్యకాలంలో జరుగుతున్న వివాహాలలో కొన్ని సంప్రదాయాలను అసలు పాటించడం లేదు.ఎందుకంటే పెళ్లి చూపులు అయినప్పటికీ నుంచి అమ్మాయిలు, అబ్బాయిలు మాట్లాడుకోవడం, కలుసుకోవడం చేస్తున్నారు.
కానీ పూర్వం రోజులలో వివాహానికి ( Marriage ) ముందు కలవడం, మాట్లాడుకోవడమే కాకుండా కనీసం చూసుకునే వారు కూడా కాదు.వాస్తవానికి పెళ్లిచూపులు అయి సంబంధం నిశ్చయం అయినా తర్వాత మండపంలో జీలకర్ర, బెల్లం పెట్టేవరకు ఒకరి మొఖం మరొకరు చూసేవారు కాదు.

అందుకే అడ్డుగా తెరా పట్టుకొని నిలబడతారు.ఇంతకీ జిలకర్ర బెల్లం ఎందుకు పెడతారు.దాని వెనుక ఉన్న రహస్యం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.మండపంలోకి పెళ్లికూతురు( Bride )ని తీసుకువచ్చిన తర్వాత అప్పటికే పెళ్లి కుమారుడిని అక్కడ కూర్చోబెట్టి ఇద్దరి మధ్య తెర పట్టుకుని నిలబడతారు.
ఒకరి తల మీద మరొకరు జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత వారి మధ్య ఉన్న తెరను తొలగిస్తారు.అప్పుడు ఇద్దరు ఒకరి ముఖం మరొకరు చూసుకుంటారు.ముఖ్యంగా చెప్పాలంటే ఈ సమయంలో వధూవరుల స్పర్శ, చూపు, రెండు కూడా శుభప్రదంగా ఉండేందుకు ఈ నియమాన్ని మన పెద్దలు పెట్టారు.

జిలకర్ర బెల్లం రెండిటికి వేరువేరు లక్షణాలు ఉంటాయి.బెల్లం ఎలాంటి అవశేషములు మిగిల్చకుండా కరిగిపోతుంది.జీలకర్ర తన రూపంలో ఎలాంటి మార్పు లేకుండా అంటిపెట్టుకొని ఉన్న పదార్థాలను సద్గుణలను అందిస్తుంది.
వివాహ బంధంతో ఒకరిలో ఒకరు కరిగిపోతూనే ఎవరి అస్తిత్వాన్ని వారు నిలుపుకోవాలని తనలో సద్గుణాలని ఎదుటి వారికి అందించాలని ఈ రెండు పద్ధతులను ఉపయోగిస్తారు.ఇదే రెండు పదార్థాల కలయిక వెనకున్న అర్థం అని పండితులు చెబుతున్నారు.
అంతేకాకుండా జిలకరకి ముసలితనం రాకుండా చేసే గుణం ఉంటుంది.బెల్లం ఏమో అమృతం( Amrutham )తో సమానం అని పెద్దవారు చెబుతూ ఉంటారు.
ఈ రెండు కలిస్తే నిత్య యవ్వనమే అని అర్థం కూడా వస్తుంది.అంటే కలకాలం నిత్యయవ్వనవంతుల్లా ఉండాలని దీవించడం కూడా మరో అర్థం వస్తుంది.