శివయ్య( Shivayya ) వెలసిన క్షేత్రాలలో అన్నిటికన్నా విశిష్టమైన క్షేత్రం కాశీ విశ్వేశురుడి దేవాలయం( Kashi Vishveshura Temple ) అని ఖచ్చితంగా చెప్పవచ్చు.కానీ కాశీ కన్నా పురాతనమైన దేవాలయం ఇంకొకటి ఉంది.
అదే వృద్ధ కాశి.ఈ ఆలయ స్థల పురాణం ప్రకారం భూమి మీదే అతి ప్రాచీనమైన దేవాలయం.
ఇది తమిళనాడులో ఉంది.వృద్ధాచలం కొండ( Vriddhachalam hill ) కూడా ఆ పరమేశ్వర స్వరూపంగా చెబుతూ ఉంటారు.
కొన్ని లక్షల సంవత్సరాల క్రితమే పరమేశ్వరుడు ఇక్కడ ఉద్భవించాడని చెబుతారు.వృద్ధ కాశీ క్షేత్రాన్ని దర్శిస్తే కోరికలు త్వరగా నెరవేరుతాయని చెబుతూ ఉంటారు.

ఈ దేవాలయంలో స్వామి ఎన్నో మహత్యాలు చూపించాడు.అందుకే వృద్ధుడు, వృద్ధాచలేశ్వరుడుగా పేరుంది.శైవులకి ముఖ్యమైన క్షేత్రాలు 108 ఉండగా వాటిలో నాలుగు క్షేత్రాలు అతి ముఖ్యమైనవి అని చెబుతూ ఉంటారు.అందులో తమిళనాడు రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో వృద్ధాచలం అతి పురాతనమైన క్షేత్రం.
ప్రళయ కాలంలో కూడా ఈ ఆలయం చెక్కుచెదరలేదు.ఈ క్షేత్రంలో స్వామిని సేవిస్తే కాశీ విశ్వనాథుని సేవించిన దానికన్నా కాస్త ఎక్కువ పుణ్యం లభిస్తుందని భక్తులను నమ్ముతారు.

పరమశివుడు( Lord Shiva ) ఈ ప్రాంతంలో ఆనంద నాట్యం చేశాడని చెబుతూ ఉంటారు.ఇక్కడ పుట్టిన, గిట్టిన, నివసించిన, భగవంతుణ్ణి ప్రార్ధించిన ఈ స్వామిని తలచినా మోక్షం లభిస్తుందని భక్తులు నమ్ముతారు.అరుణాచనానికి 100 కిలోమీటర్ల దూరంలోనే ఈ వృద్ధ కాశి ఉంది.తిరువణ్ణామలైలో చేసినట్లుగానే ప్రతి పౌర్ణమికి భక్తులు ఇక్కడ గిరిప్రదక్షిణ చేస్తూ ఉంటారు.వల్లీ దేవసేనలతో సుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువు తీరి ఉన్నాడు.ఈ దేవాలయానికి పైన చక్రాలు ఉంటాయి.
సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఇలాంటి చక్రాలు ఉన్న శివాలయాలు చాలా తక్కువగా ఉంటాయి.కాశీలో మరణిస్తే మోక్షంలో లభిస్తుంది అని ప్రజలు నమ్ముతారు.
అలాగే ఈ వృద్ధ కాశీ లో మరణించిన వారికి అంతకన్నా ఎక్కువ పుణ్యమే వస్తుందని భక్తులు నమ్ముతారు.శివుడు స్వయంభూవుడు కావడంతో స్వామినీ దర్శిస్తే మనశ్శాంతి కలుగుతుందని భక్తుల నమ్ముతారు.
అలాగే చాలా రకాల శరీరక సమస్యల నుంచి తక్షణమే విముక్తి కలుగుతుందని చెబుతూ ఉన్నారు.ఈ ఆలయం దగ్గర ఐదు దేవాలయాలలో ఒక్కటైన దుర్గాదేవిని పూజిస్తే సంతాన సమస్యలు దూరం అవుతాయని చెబుతున్నారు.