అధిక రక్తపోటు.కోట్లాది మందిని అత్యంత సర్వసాధారణంగా వేధించే సమస్యల్లో ఒకటి.
దీన్నే హై బీపీ అని కూడా అంటారు.రక్త నాళాలలో ఒత్తిడి చాలా ఎక్కువగా ఉన్నప్పుడు వచ్చే సమస్య ఇది.అధిక రక్తపోటును సకాలంలో గుర్తించి జాగ్రత్తలు తీసుకోకపోతే గుండెపోటు వచ్చే రిస్క్ భారీగా పెరుగతుంది.అందుకే అధిక రక్తపోటు ( High blood pressure )ఉన్న వారు మందులు వాడుతుంటారు.
అయితే కొన్ని కొన్ని ఆహారాలు కూడా అధిక రక్తపోటును అదుపులోకి తేవడానికి అద్భుతంగా సహాయపడతాయి.

అటువంటి వాటిలో బీట్ రూట్( Beetroot ) ఒకటి.అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి బీట్ రూట్ ఒక న్యాచురల్ మెడిసిన్ మాదిరి పని చేస్తుంది .బీట్ రూట్ లో డైటరీ నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి.ఇది రక్త ప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది.అలాగే రక్తపోటును తగ్గించడానికి చాలా ఎఫెక్టివ్ గా హెల్ప్ చేస్తుంది.అందువల్ల అధిక రక్తపోటు సమస్యతో బాధపడేవారు నిత్యం ఒక గ్లాస్ బీట్ రూట్ జ్యూస్ ను తీసుకునేందుకు ప్రయత్నించండి.తద్వారా అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
పైగా బీట్ రూట్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల బాడీలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.ఫలితంగా రక్తహీనత( Anemia ) బారిన పడకుండా ఉంటారు.అంతేకాదు రోజు బీట్ రూట్ జ్యూస్ ను తీసుకుంటే లివర్ ఫంక్షన్ ఇంప్రూవ్ అవుతుంది.మధుమేహం బారిన పడకుండా ఉంటారు.
క్యాన్సర్ వచ్చే రిస్క్ తగ్గుతుంది.చర్మం యవ్వనంగా నిగారింపుగా మెరుస్తుంది.
వృద్ధాప్య ఛాయలు త్వరగా దరి చేరకుండా ఉంటాయి.స్కిన్ టోన్ ఇంప్రూవ్ అవుతుంది

కిడ్నీ సంబంధిత వ్యాధులు వచ్చే రిస్క్ తగ్గుతుంది.ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అవుతుంది.శరీరంలో పేరుకుపోయిన మలినాలను సైతం బీట్ రూట్ జ్యూస్ తొలగిస్తుంది.
బాడీని డీటాక్స్ చేస్తుంది.కాబట్టి అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారు మాత్రమే కాదు ఎవ్వరైనా సరే బీట్ రూట్ జ్యూస్ ను డైట్ లో చేర్చుకోవచ్చు.







