చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా సీఎం జగన్ అమూల్ మిల్క్ డెయిరీకి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ అమూల్ రూ.385కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిందని సీఎం జగన్ తెలిపారు.
ఈ సంస్థ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా రెండు లక్షల మందికి ఉపాధి దొరుకుతుందని సీఎం జగన్ వెల్లడించారు.
అదేవిధంగా అమూల్ తో లక్షల మంది రైతన్నలకు మేలు జరుగుతుందన్నారు.ఆరు నెలలకోసారి అక్కాచెల్లెమ్మలకు బోనస్ తో పాటు లాభాలు వస్తాయని స్పష్టం చేశారు.పది లక్షల లీటర్లను ప్రాసెస్ చేసే స్థాయిలో డెయిరీ ఉంటుందని తెలిపారు.అమూల్ రావడంతో ఎనిమిది సార్లు పాల రేటు పెంచారని చెప్పారు.అమూల్ వచ్చాక గేదె పాలపై రూ.22, ఆవు పాలపై రూ.11 పెరిగిందన్నారు.పాల సేకరణలో పోటీ వాతావరణం పెరిగిందన్న సీఎం జగన్ దీని ద్వారా అక్కాచెల్లెమ్మలకు రూ.4,243 కోట్ల అదనపు లబ్ధి చేకూరిందని స్పష్టం చేశారు.







