తెలుగు భాషలో మాత్రమే కాకుండా పలు భాషలలో తన మధురమైన గాత్రం నుంచి ఎన్నో వేల పాటలు పాడి ప్రతి ఒక్క శ్రోతలను ఆకట్టుకున్న లెజెండరీ సింగర్ సుశీలమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఎలాంటి బాధలో ఉన్న వారైనా ఈమె పాట వింటే ఆ బాధ నుంచి బయట పడతారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
ఎందుకంటే ఈమె గాత్రం నుంచి వెలువడిన ప్రతి ఒక్క పాట ఎంతో మధురంగా ప్రతి ఒక్కరిని ఆకట్టుకునే విధంగా ఉంటాయి.

ఈ విధంగా సంగీతంలో ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న సుశీలమ్మకు 2008లో కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్ అవార్డుతో సత్కరించింది.అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రఘుపతి వెంకయ్య అవార్డుతో ఈమెను సత్కరించారు.ఇలా ఎంతో అరుదైన గౌరవాన్ని దక్కించుకున్న సుశీలమ్మ తాజాగా మరొక గౌరవాన్ని కూడా సంపాదించుకున్నారు.
సంగీతంలో ఎంతో ప్రావీణ్యం ఉండి గత కొన్ని దశాబ్దాల నుంచి ఎన్నో సేవలు చేస్తున్న సింగర్ సుశీలమ్మకు పోస్టల్ శాఖ అరుదైన గౌరవాన్ని పురస్కరించింది.
ఈ క్రమంలోనే గాయని పి.సుశీల పేరిట పోస్టల్ శాఖ ఒక పోస్టల్ స్టాంప్ రిలీజ్ చేశారు.ఈ క్రమంలోనే ఈ విషయంపై స్పందించిన సుశీలమ్మ తన పేరుమీద పోస్టల్ స్టాంప్ విడుదల కావడంతో పోస్టల్ శాఖకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎమోషనల్ అయ్యారు.
చిన్నప్పుడే పాటల పై ఎంతో మక్కువ ఉన్న సుశీల తన తండ్రి ప్రోత్సాహంతో సింగర్ గా ఇండస్ట్రీలో కొనసాగారు.ప్రస్తుతం హైదరాబాద్లో స్థిరపడ్డ తన వారసులు ఎంతో మంది ఇండస్ట్రీలో వివిధ రంగాలలో పని చేస్తూ మంచి గుర్తింపు పొందారు.







