ఈ మధ్యకాలంలో ప్రపంచ వ్యాప్తంగా చాలా మందిలో రక్త పోటు సమస్య విపరీతంగా పెరిగిపోయింది.చిన్న పెద్ద అని తేడా లేకుండా చాలామంది ప్రజలలో రక్తపోటు ఎక్కువగా ఉంది.
ఈ రక్తపోటు హఠాత్తుగా పెరుగుతూ తగ్గుతూ ఉంటే దాన్ని నియంత్రణలో ఉంచుకోవడానికి కొన్ని మార్గాలను అనుసరించడం మంచిది.ఆ నియమాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.
రక్తపోటును నియంత్రణలో ఉంచుకోవడానికి పొటాషియం ఎక్కువగా దొరికే అరటి పండ్లు, పాలకూర, టమాటాలు, పండ్లు ఎక్కువగా తినడం మంచిది.పాలకూర పచ్చివాసన వస్తుందని దూరం పెట్టవలసిన అవసరం లేదు.
మరిగిన నీటిలో వేసి రెండు నిమిషంలో పాటు ఉడికించి కర్రీ చేసుకొని తినడం మంచిది.అంతేకాకుండా దీన్ని సాలాడ్ గా తినడం కూడా మంచిదే.
అంతేకాకుండా అవిసె గింజలు కూడా అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతాయి.
వీటిలో ఉండే ఒమేగా త్రీ, పీచు రక్తనాళాల ఆరోగ్యాన్ని రక్షిస్తుంది.మట్టి వాసన వేసే వీటిని ఎలా తినాలి అని కంగారు పడాల్సిన అవసరం లేదు.వీటిని దోరగా వేయించి పొడి కలుపుకొని పండ్ల రసాల్లో కలుపుకొని తాగడం మంచిది.
అంతేకాకుండా వీటిని సలాడ్లలో కూడా కలుపుకొని తినవచ్చు.అధిక రక్తపోటు ఉన్నవారు ఈ ఆహార పదార్థాలకు కాస్త దూరంగా ఉండటమే మంచిది.
అవి ఎమిటంటే మాంసం, చక్కర, పాల ఉత్పత్తులు వీటిని తినకపోవడమే మంచిది.మాంస కృత్తుల కోసం ఆవకాడో పప్పులు, పుట్టగొడుగులను తీసుకోవచ్చు.
కాల్షియం కోసం నువ్వులు, మెంతులు, ఆకుకూరలు ఆహారంగా తీసుకోవచ్చు.కోసం ఖర్జూరం ఇతర ఇతర రకాల పండ్లను తినడం మంచిది.
ఇంకా చెప్పాలంటే శరీరంలోని జీవక్రియకు పీచు పదార్థం ఎంతో అవసరం.ఇంకా చెప్పాలంటే మానవ జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయాలంటే శరీరానికి ఫైబర్ ఎంతో అవసరం.