2024 ఎన్నికల్లో తనను వైట్ హౌస్ కు పోటీ చేయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని డోనాల్డ్ ట్రంప్ అన్నారు.ఇంకా చెప్పాలంటే తనపై తప్పుడు అభియోగాలను సిఫారసు చేస్తున్నారని ఈ అమెరికా మాజీ అధ్యక్షుడు చెబుతున్నారు.
క్యాపిటల్ భవనం హింసపై విచారణ జరుగుతున్న కమిటీ ట్రంప్ పై క్రిమినల్ ప్రాసిక్యూషన్ సిఫారసు చేసినట్లు సమాచారం.ప్రభుత్వ కార్యకలాపాలను అడ్డుకోవడం, యునైటెడ్ స్టేట్స్ కు ద్రోహం చేయడం, తిరుగుబాటు దారులకు సహాయం చేయడం వంటివి ట్రంప్ పై కమిటీ మోపిన నేరాల్లో ఉన్నాయి.ఈ క్రమంలోనే ట్రంప్ ను ప్రాసిక్యూట్ చేయాలని కమిటీ సిఫారసు చేసినట్లు సమాచారం.
2021 జనవరి 6న క్యాపిటల్ భవనం పై దాడి జరిగిన విషయం తెలిసిందే.2020 అధ్యక్ష ఎన్నికల్లో ఓటమికి నిరాసనగా వైట్ హౌస్ లో ట్రంప్ అనుకూల వర్గం సమావేశమై ఈ పార్లమెంట్ భవనాన్ని ధ్వంసం చేసినట్లు ఆరోపణలు కూడా ఉన్నాయి.ఈ సంఘటనలో 100 మందికి పైగా గాయపడి, నలుగురు కాపిటల్ పోలీసు అధికారులు మృతి చెందారు.
అయితే వీరిని మాజీ అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టి దాడికి ఉసిగొలిపినట్లు కూడా ఆధారాలు ఉన్నట్లు సమాచారం.
క్యాపిటల్ భవనం పై హింసకు ట్రంప్ బాధ్యుడని దర్యాప్తు కమిటీ సిఫారసు చేస్తూ ఉంది.ఇదే జరిగితే 2024 ఎన్నికల్లో ట్రంప్ పోటీ చేయాలన్న చేయలేకపోయే అవకాశం ఉంది.కమిటీ ప్రతినిధి జామీ రాక్సిన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ నేరాలు మోపడానికి మా విచారణ సమయంలో సేకరించిన సాక్ష్యాలు సరిపోతాయని మేము నమ్ముతున్నామని చెబుతున్నారు.
కమిటీ సిఫారసు పై ట్రంపు మాట్లాడుతూ ఈ వ్యవహారం అంతా ఫేక్, తనపై కుట్ర జరుగుతుందని చెబుతున్నారు.కమిటీ తప్పుడు పక్షపాత నివేదికను ఇచ్చిందని కూడా ఈ సందర్భంగా చెబుతున్నారు.2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో నన్ను పోటీ చేయనీయకుండా ఆపేందుకే ఈ కుట్రలో భాగమే కమిటీ తప్పుడు సిఫారసును ఇస్తుందని ట్రంప్ అన్నారు.