ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర( Rajanna Dora ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు( AP Elections ) వస్తాయని స్పష్టం చేశారు.2019లో కూడా డిసెంబర్ లో షెడ్యూల్ విడుదల అయింది.అందరూ బాగుండాలి అంటే వైసీపీ పార్టీని( YCP ) ఆదరించాలి అని స్పష్టం చేశారు.
దీంతో ఏపీ డిప్యూటీ సీఎం రాజన్నదొర చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి.ఇటీవల జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని ఉభయగోదావరి జిల్లాల పర్యటనలో కామెంట్లు చేయడం జరిగింది.
ముందస్తు ఎన్నికలు వస్తే… జూన్ నెల నుండి పార్టీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు.అంతకు ముందు నుంచే తెలుగుదేశం పార్టీ కీలక నాయకులు చంద్రబాబు సైతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉన్నాయని నాయకులంతా సిద్ధం కావాలని వ్యాఖ్యలు చేయడం జరిగింది.ఈ క్రమంలో తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం రాజన్న దొర.డిసెంబర్ లేదా జనవరిలో ఎన్నికలు వస్తాయి అని కామెంట్లు చేయడం ఏపీ రాజకీయాల్లో సంచలనంగా మారాయి.మరి ముందస్తు ఎన్నికలు వస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుందో చూడాలి.