రోటరీ లింబ్ సెంటర్ లో ఘనంగా మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గారి జన్మదిన వేడుకలు వారి జన్మదినం సందర్భంగా ఉచితంగా 84మందికి కృత్రిమ పాదాలు పంపిణీ పువ్వాడ ఫౌండేషన్ ద్వారా విరాళం ఖమ్మం : ఎన్.ఎస్.పి రోటరీ లిమ్ సెంటర్ లో బుధవారం మాజీ ఎమ్మెల్యే & ఎమ్మెల్సీ పువ్వాడ నాగేశ్వరరావు గారి 84వ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు .ఈ సందర్బంగా 84మందికి దివ్యాంగులకు జేపూర్ పరిజ్ఞానంతో చేయించిన కృత్రిమ పాదాలను మరియు చిన్నారులకు సైకిల్ లను , మహిళలకు కుట్టు మిషన్లు ఉచితంగా పంపిణీ చేశారు .అలాగే 3,36,000 రూపాయల చెక్కు ను వారు విరాళంగా పువ్వాడ ఫౌండేషన్ ద్వారా అందజేశారు .అనంతరం రోటరీ క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ మానవ జాతి పరిణామ క్రమంలో ‘మనిషిని మనిషిగా’ తీర్చిదిద్దిన జీవన వేదమే సహానుభూతి అని ఈ సహానుభూతి ఆధారంగానే ఎదుటి మనిషియొక్క శారీరక , మానసిక , ఆర్ధిక , సామాజిక బాధలను అర్ధం చేసుకుంటుందని , బాధాసర్పద్రష్టులైన దివ్యాంగులకు చేయూత నివ్వడానికి ముందుకు వచ్చినందుకు పువ్వాడ ఫౌండేషన్ కుటుంబ సభ్యులకు రోటరీ లింబ్ సెంటర్ నిర్వాహకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు .దశాబ్దాలుగా , అంచెలంచెలుగా , రాజకీయ భావజాలలకు అతీతంగా లక్షలాది మందికి చేరువ కావటానికి మీ విధి విధానాల రూపకల్పనే సమ సమాజం కోసం అన్ని వర్గాలతో సాన్నిహిత్యంగా మెలిగి , ప్రతివారికి ‘పువ్వాడ నా మనిషి’ అన్నంతగా చేరువైనారు అని అన్నారు .
విద్య , ఆరోగ్య సామాజిక అవసరాలను సహానుభూతితో తీర్చి ప్రజలకు ఆసరాగా నిలిచారని కొనియాడారు .ఈ సందర్భంగా పువ్వాడ నాగేశ్వరరావు మాట్లాడుతూ రోటరీ ట్రస్ట్ ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్కు వెన్నుదన్నుగా ఉంటు పువ్వాడ ఫౌండేషన్ ద్వారా సహాయసహకారాలు అందజేస్తారని పేర్కొన్నారు .అనంతరం కేక్ కట్ చేసి నిర్వాహకులు పువ్వాడ నాగేశ్వరరావు దంపతులను ఘనంగా శాలువాతో సన్మానించి ప్రశంసా పత్రాన్ని అందించారు .ఈ కార్యక్రమంలో క్లబ్ చైర్మన్ పి.డి.జి.మల్లాది వాసుదేవ్ , అధ్యక్షులు వల్లభనేని రామారావు , కార్యదర్శి దొడ్డపనేని సాంబశివరావు , పసుమర్తి రంగారావు , Sk.అక్బర్ పాషా , కాళ్ళ పాపారావు , మేకల భిక్షమయ్య , తవిడిశెట్టి హన్మంతరావు , 53వ డివిజన్ కార్పొరేటర్ పగడాల శ్రీవిద్య – పగడాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు .