ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురం గ్రామంలోని ఓ ఇంట్లో గత 2019లో గ్యాస్ సిలిండర్ లీకై ఇంట్లోని ఐదుగురు మంటల్లో కాలి, తీవ్ర గాయాలపాలై మరణించిన బాధితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్ధిక సహాయాన్ని అందించారు.ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీ వారు పరిహారం నిమిత్తం చెల్లించిన ప్రీమియం ద్వారా మంజూరైన రూ.6 లక్షలు, రూ.8 లక్షలు, రూ.14 లక్షల ప్రమాద బీమా మూడు చెక్కులను బుధవారం హైదరాబాద్ లోని వారి అధికారిక నివాసంలో బాధిత కుటుంబానికి స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.ఆనందంగా పండుగ జరుపుకునేందుకు ఆ కుటుంబం సిద్ధమైన నేపథ్యంలో అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు