ప్రమాద బీమా చెక్కులను అందించిన మంత్రి పువ్వాడ అజయ్ కుమార్

ఖమ్మం జిల్లా కామేపల్లి మండల పరిధిలోని కొమ్మినేపల్లి పంచాయతీ పండితాపురం గ్రామంలోని ఓ ఇంట్లో గత 2019లో గ్యాస్ సిలిండర్ లీకై ఇంట్లోని ఐదుగురు మంటల్లో కాలి, తీవ్ర గాయాలపాలై మరణించిన బాధితులకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆర్ధిక సహాయాన్ని అందించారు.

ఈ మేరకు ఇండియన్ ఆయిల్ గ్యాస్ కంపెనీ వారు పరిహారం నిమిత్తం చెల్లించిన ప్రీమియం ద్వారా మంజూరైన రూ.

6 లక్షలు, రూ.8 లక్షలు, రూ.

14 లక్షల ప్రమాద బీమా మూడు చెక్కులను బుధవారం హైదరాబాద్ లోని వారి అధికారిక నివాసంలో బాధిత కుటుంబానికి స్వయంగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అందజేశారు.

ఆనందంగా పండుగ జరుపుకునేందుకు ఆ కుటుంబం సిద్ధమైన నేపథ్యంలో అంతలోనే ఈ విషాదం చోటు చేసుకోవడం దురదృష్టకరమని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విచారం వ్యక్తం చేశారు.

చైనా పరువు గంగపాలు.. ఈ వీడియో చూస్తే డ్రాగన్ కంట్రీపై అభిప్రాయం మారిపోతుంది!