స్టార్ హీరోయిన్ శృతిహాసన్ వదులుకున్న సినిమాలివే..?

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుని ఒక వెలుగు వెలుగుతున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు.తెలుగులో శృతిహాసన్ నటించిన సినిమాల్లో ఎక్కువ సినిమాలు హిట్ అయ్యాయి.తెలుగులో కెరీర్ తొలినాళ్లలో శృతి నటించిన సినిమాలు ఫ్లాప్ అయినా గబ్బర్ సింగ్ సినిమా తరువాత ఆమె నటించిన సినిమాలు ఎక్కువగా సక్సెస్ అయ్యాయి.2021లో క్రాక్ తో శృతి ఖాతాలో మరో సక్సెస్ చేరింది.

 Heroine Shruti Hassan Rejected These 5 Movies, Heroine Shruti Hassan, Jersey Mov-TeluguStop.com

Telugu Dj, Shruti Hassan, Jersey, Rebel, Shruti Haasan, Vakeel Saab-Movie

అయితే ఈ హీరోయిన్ వేర్వేరు కారణాల వల్ల కొన్ని సినిమాలను రిజెక్ట్ చేయగా ఆ సినిమాలలో కొన్ని హిట్ అయితే కొన్ని మాత్రం ఫ్లాప్ అయ్యాయి.శృతి హాసన్ రిజెక్ట్ చేసిన సినిమాల్లో బిజినెస్ మేన్ ఒకటి.పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.మహేష్ బాబు కెరీర్ లోని బ్లాక్ బస్టర్ హిట్లలో బిజినెస్ మేన్ ఒకటనే సంగతి తెలిసిందే.

నాచురల్ స్టార్ నాని, శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్ లో తెరకెక్కిన జెర్సీ బ్లాక్ బస్టర్ హిట్ అనే సంగతి తెలిసిందే.

Telugu Dj, Shruti Hassan, Jersey, Rebel, Shruti Haasan, Vakeel Saab-Movie

జెర్సీ సినిమాకు జాతీయ అవార్డు కూడా వచ్చింది.అయితే ఈ సినిమాలో హీరోయిన్ రోల్ కు శృతి హాసన్ ను తీసుకోవాలని దర్శకనిర్మాతలు భావించినా కొన్ని కారణాల వల్ల ఆమె ఎంపిక కాలేదని తెలుస్తోంది.ప్రభాస్, రాఘవ లారెన్స్ కాంబినేషన్ లో వచ్చిన రెబల్ సినిమాలో తమన్నా రోల్ కు మొదట శృతి హాసన్ ఎంపికయ్యారట.

అయితే ఈ సినిమాలో నటించడానికి శృతిహాసన్ ఆసక్తి చూపలేదని సమాచారం.

Telugu Dj, Shruti Hassan, Jersey, Rebel, Shruti Haasan, Vakeel Saab-Movie

స్టైలిష్ స్టార్ బన్నీ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వచ్చిన డీజే సినిమాలో మొదట శృతిహాసన్ కే ఛాన్స్ వచ్చిందని కానీ ఆ తరువాత శృతి స్థానంలో దర్శకనిర్మాతలు పూజా హెగ్డేను తీసుకున్నారని తెలుస్తోంది.శ్రీనువైట్ల రవితేజ కాంబినేషన్ బ్లాక్ బస్టర్ కాంబినేషన్ కాగా నీకోసం, వెంకీ, దుబాయ్ శ్రీను సినిమాల తరువాత రవితేజ శ్రీను వైట్ల కాంబినేషన్ లో అమర్ అక్బర్ ఆంటోనీ సినిమా తెరకెక్కి డిజాస్టర్ గా నిలిచింది.

ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ శృతిహాసన్ కు రాగా ఆమె రిజెక్ట్ చేశారని సమాచారం.

శృతి వేర్వేరు కారణాల వల్ల నటించే ఛాన్స్ మిస్ చేసుకున్న సినిమాల్లో మూడు సినిమాలు హిట్లు అయితే రెండు సినిమాలు మాత్రం డిజాస్టర్లు కావడం గమనార్హం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube