ఆంధ్రప్రదేశ్( AP ) రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన తిరుమలకు( Tirumala ) ప్రతి రోజు ఎన్నో వేల మంది భక్తులు తరలి వచ్చి శ్రీవారిని దర్శించుకుంటూ ఉంటారు.అంతే కాకుండా మరి కొంత మంది భక్తులు శ్రీవారికి పూజలు, అభిషేకాలు కూడా నిర్వహిస్తూ ఉంటారు.
ముఖ్యంగా చెప్పాలంటే తిరుమలలో మే 14 నుంచి 18వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హనుమాన్ జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో ధర్మారెడ్డి( EO Dharmareddy ) వెల్లడించారు.ఈ సందర్భంగా తిరుమలలోని అన్నమయ్య భవన్ లో నిర్వహించిన డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో భక్తులతో ఆయన మాట్లాడారు.
ఇంకా చెప్పాలంటే తిరుమలలో శనివారం ఉదయం రెండు ఘాట్ రోడ్లు, నడత మార్గాల్లో శ్రమదాన కార్యక్రమంలో సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పాల్గొంటారని ధర్మారెడ్డి వెల్లడించారు.ఇంకా ఆయన మాట్లాడుతూ హనుమాన్ జయంతి ఉత్సవాలలో భక్తులను విశేషంగా ఆకట్టుకునేందుకు తిరుమలలోని అంజనాద్రి, ఆకాశగంగ, నాదనీరాజనం వేదికల పై అన్నమాచార్య, దాససాహిత్య, హిందూ ధర్మ ప్రచార పరిషత్ కళాకారులతో ఆధ్యాత్మిక భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు.
ముఖ్యంగా చెప్పాలంటే మే 14వ తేదీన తుని తపోవనం సచ్చిదానంద స్వామి,మే 15 న కుర్తాలం పీఠాధిపతి సిద్దేశ్వరానంద భారతి స్వామి, మే 16న కంచి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి స్వామి, మే 17 అహోబిలం మఠాధిపతి శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి, మే 18 న పుష్పగిరి మఠం పుష్పగిరి మఠం పీఠాధిపతి విద్యా శంకర భారతి తీర్థ స్వామీజీలు అనుగ్రహ భాషణం చేయనున్నారు.
ఇంకా చెప్పాలంటే తిరుమల వేద విజ్ఞాన పీఠంలో ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 18 గంటల పాటు 67 మంది ప్రముఖ పండితులతో అఖండ పారాయణ నిర్వహిస్తున్నామని కూడా ఈ సందర్భంగా ఈవో వెల్లడించారు.
DEVOTIONAL