Chitti Babu : నిహారిక అత్త మామల గురించి సంచలన విషయాలు బయట పెట్టిన చిట్టి బాబు

2020లో మెగా బ్రదర్ నాగబాబు డాటర్ నిహారిక, జొన్నలగడ్డ చైతన్య( Chaitanya Jv )ని వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసినదేరు.అయితే పెళ్ళై ముచ్చటగా మూడేళ్ళైనా కాకుండానే విడాకులు తీసుకోవడం ఇపుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

 Chitti Babu About Niharika Husband Family-TeluguStop.com

గత కొన్నాళ్లుగా వీరి విడాకులపై ఎన్నో గాసిప్స్ రాగా ఇటీవలే కోర్ట్ వీరికి విడాకులను మంజూరు చేయడంతో వాటికి ఫుల్ స్టాప్ పడింది.ఇకపోతే ఈ ఇష్యూ గురించి సీనియర్ ప్రొడ్యూసర్ చిట్టిబాబు తాజాగా మాట్లాడడం జరిగింది.

నిహారిక విడాకుల విషయంలో మెగా ఫ్యామిలీ బాధలో ఉందని, అది వాళ్ళ కుటుంబ విషయం కావున చర్చించుకోవడం కరెక్ట్ కాదని చిట్టిబాబు మీడియా వేదికగా అభిప్రాయపడ్డారు.

Telugu Chaitanya Jv, Chitti Babu, Niharika, Tollywood-Movie

ఈ సందర్భంగా ఓ మీడియా నిహారిక( Niharika ), చైతన్య విడాకులకు కారణం మెగా ఫామిలీ అనే టాక్ బయట వినబడుతోంది అంటూ చిట్టిబాబు( Chitti Babu )ని అడగడంతో ఆయన స్పందిస్తూ….“నిహారిక మెగా కుటుంబం వారసురాలు, సినిమాల్లో నటించింది కాబట్టి ఈ విడాకుల విషయంపై మీడియా మరియు సోషల్ మీడియా( Social media ) ఇంత రాద్ధాంతం చేస్తోంది.కానీ బయట కూడా ఎంతో మంది చిన్న చిన్న కారణలకే విడిపోతున్నారు.

వారికోసం ఎవరికీ అవసరం లేదు.కోర్టులో నేడు విడాకులకు సంబంధించిన కేసులు చాలానే పెండింగ్ లో వున్నాయి.

అయితే వాటి గురించి ఎవరూ చర్చించుకోలేరు.వీళ్ళు సెలబ్రిటీలు కాబట్టి మాట్లాడుతాం.

మెగా ఫామిలీ అనగానే ప్రతి ఒక్కడికీ రాయి విసరాలని అనిపిస్తుంది… ఇది కరెక్ట్ కాదు.ఈ విధానం మారాలి.ముందు మనుషుల్లాగా ప్రవర్తించాలి.” అంటూ మండిపడ్డారు.

Telugu Chaitanya Jv, Chitti Babu, Niharika, Tollywood-Movie

ఈ సందర్భంగా యూట్యూబ్ ఛానళ్లపై కూడా ఆయన విరుచుకు పడ్డారు.చాలామంది అడ్డమైన వాళ్ళు యూట్యూబ్ ఛానళ్లు పెడుతూ ఇలా పేరుమోసిన పెద్దవారిని టార్గెట్ చేసి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు.ఈరోజుల్లో విడాకులు తీసుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయిందని, పెళ్లయ్యాక ఇద్దరి అభిప్రాయలు కలవనపుడు విడిపోవాలని నేటితరం అనుకుంటున్నారని అన్నారు.అయితే సాధారణమైన వారిగురించి ఎపుడూ మాట్లాడని జనాలు ఇలా సెలిబ్రిటీలపై ఏడవం సరికాదని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube