'జైలర్' రిలీజ్ డేట్ ఫిక్స్.. చిన్న వీడియోతో క్లారిటీ!

సూపర్ స్టార్ రజనీ కాంత్ ( Rajinikanth ) గురించి ఇండియన్ వైడ్ గా ప్రేక్షకులకు పరిచయమే.ఈయన ప్రత్యేక పరిచయం అవసరం లేదు.

 Rajinikanth's Jailer Gets A Release Date, Rajinikanth, Jailer, Jailer Release-TeluguStop.com

కోలీవుడ్ స్టార్ అయినప్పటికీ ఇండియన్ వైడ్ గా గుర్తింపు తెచ్చుకుని ఫ్యాన్స్ చేత సూపర్ స్టార్ గా మన్ననలు పొందుతున్నాడు.ఏడు పదుల వయసు దాటినా కూడా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.

హిట్ ప్లాప్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు.

మరి ప్రెజెంట్ రజనీకాంత్ చేస్తున్న సినిమా ”జైలర్”( Jailer ).ఈ సినిమాకు ఈ మధ్య కాలంలో ఎప్పుడు లేనంత హైప్ నెలకొంది.ఎన్నో ఏళ్ల ముందు సూపర్ స్టార్ ను చుసిన విధంగానే ఈ సినిమాలో రజినీకాంత్ కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ కు ఈ సినిమాపై ఇంట్రెస్ట్ పెరిగింది.

నెల్సన్ దిలీప్ కుమార్( Nelson Dilipkumar ) దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రెజెంట్ శరవేగంగా షూటింగ్ జరుపు కుంటుంది.

ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకోవడంతో మేకర్స్ వరుస అప్డేట్ లను అందిస్తూ ఈ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా నుండి మరో అప్డేట్ ఇచ్చారు మేకర్స్.ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించడమే కాకుండా చిన్న వీడియో కూడా వదిలి సినిమాపై మరింత ఇంట్రెస్ట్ పెంచేశారు.

ఈ వీడియోలో రజిని స్టైల్, ఎనర్జిటిక్ అన్ని కూడా ఆకట్టు కున్నాయి. ఇక ఆగస్టు 10, 2023న ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టు ప్రకటించారు.చూడాలి ఈ సినిమాతో అయిన మంచి హిట్ అందుకుంటాడో లేదో.ఇక ఈ సినిమాలో రజినీకాంత్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుండగా.సన్ పిక్చర్స్ వారు భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.అలాగే మలయాళ స్టార్ మోహన్ లాల్, కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కూడా ఈ సినిమాలో కీలక రోల్స్ లో నటిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube