కోలీవుడ్ స్టార్ హీరో సూర్య గురించి తెలియని సినీ ప్రేక్షకులు లేరు.ఈయనకు కోలీవుడ్ లో మాత్రమే కాదు ఇండియా అంతటా ఫ్యాన్స్ ఉన్నారు.
సూర్య నటనకు ఫిదా అవ్వని ఫ్యాన్స్ లేరు అంటే అతియసోక్తి కాదేమో.గజినీ సినిమాతో తెలుగులో కూడా భారీ ఫ్యాన్స్ ఫాలోయింగ్ సంపాదించు కున్నాడు సూర్య.
ఈ సినిమా తర్వాత ఈయనకు తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.అప్పటి నుండి ఈయన నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా రిలీజ్ చేస్తున్నారు.
ఈయన అంటే కోలీవుడ్ ప్రేక్షకులకే కాదు మన టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా ఇష్టం.ఈయన నటించిన జై భీమ్, ఆకాశమే నీ హద్దురా రెండు చిత్రాలు కూడా సూర్యను మరో మెట్టు ఎక్కించాయి.
ఇక ఇటీవలే సూర్య కమల్ హాసన్ నటించిన విక్రమ్ సినిమాలో క్యామియో రోల్ చేసిన విషయం తెలిసిందే.ఈ రోల్ కు విశేష స్పందన వచ్చింది.
ఇక ప్రెసెంట్ సూర్య వాడి వాసల్ సినిమాను చేస్తున్నాడు.ఈ సినిమాను వెట్రిమారన్ తెరకెక్కిస్తున్నాడు.ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టుగా తెరకెక్కుతుంది.అనౌన్స్ చేసినప్పటి నుండే ఈ సినిమాలో అంచనాలు ఓ రేంజ్ లో పెరిగి పోయాయి.
ఇక ఈ సినిమాతో పాటు కోలీవుడ్ డైరెక్టర్ శివ తో మరొక బిగ్గెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కూడా అనౌన్స్ చేసాడు.సూర్య కెరీర్ లో 42వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా ఎప్పుడో షూటింగ్ కూడా స్టార్ట్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో దిశా పటానీ హీరోయిన్ గా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.

తాజాగా ఈ సినిమా నుండి అదిరిపోయే వార్త బయటకు వచ్చింది.ఈ సినిమా ఇంకా షూట్ పూర్తి కాకుండానే డిజిటల్ హక్కులకు భారీ ధర పలికినట్టు టాక్.ఒక ప్రముఖ సంస్థ ఈ సినిమా హక్కులను మ్యాజిక్ ఫిగర్ కు సొంతం చేసుకున్నారట.
ఏకంగా 100 కోట్లతో ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుని రికార్డ్ క్రియేట్ చేస్తున్నారు.మన ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో కేవలం డిజిటల్ రైట్స్ కే ఇంత మొత్తం చెల్లించడం రికార్డు అనే చెప్పాలి.
మరి ఈ మొత్తం చూస్తేనే ఈ సినిమాపై ఎంత హైప్ ఉందొ చెప్పవచ్చు.







