అంతకుముందు ఏ సినిమా టీజర్, ట్రైలర్ రిలీజ్ అయినా ప్రసాద్ ల్యాగ్ లో ఉండేది.కొన్ని సినిమాలకు ప్రసాద్ ఐమ్యాక్స్ లో వేసె వారు.
అయితే ఎప్పుడైతే మహేష్ ఏ.ఎం.బి( Mahesh bau ) మాల్ వచ్చిందో ఇప్పుడు అన్ని టీజర్, ట్రైలర్ రిలీజ్ లు అక్కడే ఏర్పాటు చేస్తున్నారు.ఆ మాల్ లో ప్రెస్ మీట్ కు అవకాశం ఉండటం వల్ల అక్కడికే అందరు వెళ్తున్నారు.
అయితే త్వరలో టీజర్, ట్రైలర్( Trailer ) రిలీజ్ వెన్యూ మారబోతుందని తెలుస్తుంది.ఫిల్మ్ నగర్ నుంచి కోకా పేట్ దాకా వెళ్తే కానీ ఏ.ఎం.బి మాల్ రాదు.టీజర్ రిలీజ్ చేయాలంటే అక్కడ దాకా వెళ్లాల్సిందే.
అయితే అల్లు అర్జున్( Allu arjun ) సత్యం థియేటర్ ను కొనేసి ఏసియన్ వారితో కలిసి దాని నిర్మాణంలో భాగమయ్యాడని తెలిసిందే.
ఇప్పుడు ఆ సత్యం థియేటర్ అల్లు అర్జున్ మాల్ గా మారబోతుంది.అమీర్ పేట్ సెంటర్ లో ఉండే ఈ సత్యం థియేటర్ దగ్గర ఏర్పడుతున్న ఈ ఏసియన్ అల్లు అర్జున్ థియేటర్ (AAA) కి అన్ని ప్రోగ్రాంస్ షిఫ్ట్ చేయనున్నారు.
ఇక మీదట టీజర్, ట్రైలర్ రిలీజ్ ఉంటే ఇక్కడ ఏర్పాటు చేయాలని చూస్తున్నారు.అలా చేయడం వల్ల థియేటర్ గురించి అందరికి తెలిసే ఛాన్స్ ఉంటుంది.మొత్తానికి అల్లు అర్జున్ పెద్ద ప్లాన్ లోనే ఉన్నాడని చెప్పొచ్చు.