మీరు ఈ వేసవిలో ( Summer )సరదాగా ఓ వ్యాపారాన్ని ట్రై చేయాలని అనుకుంటున్నారా? అయితే మీరు మంచి ఆలోచన చేసినట్టే.ఎందుకంటే వేసవి కాలాన్ని క్యాష్ చేసుకొనే సింపుల్ వ్యాపార ఐడియాలు అనేకం వున్నాయి.
ఇందులో తక్కువ పెట్టుబడులు పెడుతూ ఎక్కువ లాభాలను పొందవచ్చు.ప్రస్తుతం ఎండలు బాగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రజలందరూ కూడా చల్లటి పదార్థాలను సేవించడానికి ఎక్కువగా ఆసక్తి కనబరుస్తారు.
అదే విషయాన్ని వ్యాపారాలు క్యాష్ చేసుకోవచ్చు. మజ్జిగ, లస్సి, కూల్ డ్రింక్స్, జ్యూస్ వంటి వ్యాపారాలు చూడడానికి చాలా సింపుల్ గా కనిపించినప్పటికీ లాభాల మార్జిన్ చాలా ఎక్కువగా ఉంటుంది.
ఇందులో మొదటగా కూల్ డ్రింక్స్ బిజినెస్ (Cool Drinks Business )గురించి చెప్పుకోవాలి.ఈ వేసవిలో కూల్ డ్రింక్స్ కి మంచి డిమాండ్ ఉంటుంది.అందుకే బాగా రద్దీగా ఉండే ప్రదేశాలలో ఈ వ్యాపారాన్ని స్టార్ట్ చేస్తే నెలకు లక్ష లేదా లక్షన్నర వరకు డబ్బు సంపాదించే అవకాశం ఉంటుంది.అయితే దీనికోసం పెద్దగా కష్టపడాల్సిన పని ఉండదు.
ముందుగా పెట్టుబడి పెడితే మీరు పెట్టిన పెట్టుబడి ఓ రెండు మూడు నెలలలో సంపాదించేయొచ్చు.
తరువాత ఐస్ క్రీమ్ బిజినెస్ ( Ice cream business )గురించి మాట్లాడుకోవాలి.పిల్లల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు దీనిని ఇష్టపడుతూ వుంటారు.ఎండలు పెరిగిపోతున్న నేపథ్యంలో ఐస్ క్రీమ్ బిజినెస్ కి కూడా మంచి డిమాండ్ ఉంటుంది.
దీనిని సాధారణంగా స్కూల్స్, కాలేజెస్ దగ్గరగా స్టార్ట్ చేస్తే ఇక తిరుగులేని బిజినెస్ అవుతుంది.ఈ వ్యాపారం చేయడం ద్వారా మీకు ప్రతి నెల రూ.80 వేలకు పైగా ఆదాయం వస్తుంది.ఇక చివరగా జ్యూస్ బిజినెస్ గురించి మాట్లాడుకోవాలి.
వేసవికాలంలో రోడ్డు సైడ్ ఎక్కడ జ్యూస్ బిజినెస్ మొదలు పెట్టినా మినిమమ్ గ్యారంటీ.దీనివల్ల మీకు రోజుకు అన్ని ఖర్చులు పోను రూ.5000 సంపాదించే అవకాశం కలదు.