కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ గెలుపుపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ స్పందించారు.విజయానికి కారణమైన కర్ణాటక ప్రజలతో పాటు పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు.
పేదల కోసం కాంగ్రెస్ పోరాడిందని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.తమను ప్రేమతో గెలిపించారన్నారు.
విద్వేష రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు.కర్ణాటక తరహాలోనే మిగతా అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు.







