హీరోయిన్‌గా ఇప్పుడిప్పుడే సెటిల్‌ అవుతున్న సమయంలో పెళ్లి చేసుకుంది

మారుతి దర్శకత్వంలో వచ్చిన చిన్న బడ్జెట్‌ మూవీ బస్టాప్‌.ఆ సినిమాలో హీరోయిన్‌ గా నటించిన అమ్మాయి ఆనంది.

 Bus Stop Heroine Anandi Marriage In Warangal Function Hall , Anandi, Bus Stop Mo-TeluguStop.com

తెలుగు అమ్మాయి అయిన ఆనంది ఆకట్టుకునేలా నటించడంతో పాటు అందంగా ఉంది.దాంతో ఆమెకు తెలుగులో ఆ తర్వాత ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయి.

అక్కడ నుండి ఈ అమ్మడు తమిళంకు షిప్ట్‌ అయ్యింది.అనూహ్యంగా తమిళనాట ఈ అమ్మడికి వరుసగా ఆఫర్లు వస్తూ వచ్చాయి.

ప్రస్తుతం కూడా అక్కడ ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు రెండు మూడు విడుదలకు సిద్దంగా ఉన్నాయి.ఈ సమయంలో ముద్దుగుమ్మ ఆనంది పెళ్లి చేసుకోవడం చర్చనీయాంశంగా ఉంది.

తెలుగులో ఇటీవలే జోంబీ రెడ్డి సినిమాతో పాటు మరో రెండు సినిమాలు చేసేందుకు కమిట్‌ అయిన ఈ అమ్మడు అనూహ్యంగా పెళ్లి చేసుకుంది.కెరీర్‌ పీక్స్‌ లో ఉన్న సమయంలో ఏ ఒక్కరు ఇలా పెళ్లికి సిద్దం అవ్వరు.

కాని ఆనంది మాత్రం పెళ్లికి రెడీ అయ్యింది.

ఆనంది పెళ్లి చేసుకున్న వ్యక్తి తమిళ సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తి.

కనుక ఈమెకు ముందు ముందు కూడా ఆఫర్లు వస్తే నటించే అవకాశం ఉంది.తెలుగు అమ్మాయిలు హీరోయిన్‌ లుగా నిలదొక్కుకోవడం కష్టం.

అలాంటిది పెళ్లి అయిన తర్వాత హీరోయిన్‌ గా ఆఫర్లు దక్కించుకోవడం అంటే సాధ్యమేనా అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు.మరో రెండు మూడు సంవత్సరాల తర్వాత పెళ్లి చేసుకుని ఉంటే బాగుండేది అనేది కొందరి అభిప్రాయం.

ఇక ఈమె పెళ్లి విషయానికి వస్తే తమిళంకు చెందిన అసిస్టెంట్‌ డైరెక్టర్ సోక్రటిస్ ను కొంత కాలంగా ప్రేమిస్తుందట.ఇద్దరి ప్రేమకు ఇరు కుటుంబాలు ఒప్పుకున్నాయి.

దాంతో పెళ్లి పనులు మొదలు అయ్యాయి.పెళ్లి హడావుడి మొత్తం కూడా వరంగల్‌ లో కనిపించింది.

ఆనంది కుటుంబం వరంగల్‌ కు చెందడంతో అక్కడే ఒక ఫంక్షన్‌ హాల్‌ లో నిర్వహించారు.కరోనా కారణంగా పెళ్లికి దగ్గరి బంధువులు మాత్రమే హాజరు అయ్యారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube