నిన్నటి బిగ్‌ బాస్ ఎపిసోడ్‌ కు ఘోర అవమానం

తెలుగు బిగ్ బాస్‌ సీజన్ 5 రేటింగ్ విషయంలో చాలా అసంతృప్తి వ్యక్తం అవుతోంది.నాగార్జున గత రెండు సీజన్‌ ల్లో బాగానే రేటింగ్ ను రాబట్టాడు.

 Telugu Bigg Boss Last Weekend Rating Details, Bb5 Telugu, Bigg Boss, Film News,-TeluguStop.com

కాని ఈ సీజన్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రేటింగ్‌ రావడం లేదు అంటూ స్టార్‌ మా గగ్గోలు పెడుతోంది.అసలు వచ్చే సీజన్ ఉంటుందా లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇలాంటి సమయంలో తాజా ఎపిసోడ్ రేటింగ్‌ మరీ దారుణంగా ఉండబోతుంది.ఇది ఘోర అవమానంగా నాగార్జున కు ఉంటుందని అంటున్నారు.

ప్రతి వారం కూడా వీక్ డేస్ కు రేటింగ్ ఎలా ఉన్నా వీకెండ్స్ లో మాత్రం ఒక మోస్తరుగా రేటింగ్‌ దక్కుతోంది.కాని నిన్నటి ఆదివారం ఎపిసోడ్ రేటింగ్‌ ను కనీసం ఊహించడానికి కూడా లేనంతగా తక్కువ రేటింగ్‌ నమోదు అవ్వబోతున్నట్లుగా చెబుతున్నారు.

అత్యంత చెత్త రేటింగ్ ఆది వారం ఎపిసోడ్‌ దక్కించుకున్నట్లుగా చెబుతున్నారు.ఇండియా పాకిస్తాన్‌ టీ20 వరల్డ్‌ కప్ గ్రూప్‌ మ్యాచ్‌ ఉండటమే దీనికి కారణం.

సాదారణంగా క్రికెట్‌ ఉంటే ఆ రోజు ఎపిసోడ్ కు చాలా తక్కువ రేటింగ్‌ వస్తుంది.అలాంటిది ఇండియా పాకిస్తాన్‌ మ్యాచ్‌ అంటే మళ్లీ ఆలోచించాల్సిన అవసరమే లేదు.

ఎందుకంటే బిగ్‌ బాస్ కంటే ప్రధానంగా ప్రతి ఒక్కరు టీమ్ ఇండియా ఆటను చూడాలనుకున్నారు.ఇప్పటి వరకు పాకిస్తాన్ వరల్డ్‌ కప్‌ చరిత్రలో నెగ్గినదే లేదు.దాంతో ఈ మ్యాచ్ కూడా ఇండియా గెలుస్తుందనే నమ్మకంతో అంతా కూడా ఈ మ్యాచ్ ను చూశారు.

Telugu Bb Telugu, Bigg Boss, Cricket, Ind Pak, Nagarjuna, Pathetic, Telugubigg,

దాంతో బిగ్ బాస్ సీజన్‌ 5 ను కంటే కూడా క్రికెట్‌ ను ఎక్కువ మంది చూస్తారు అనేది అందరికి తెల్సిందే.అనుకున్నట్లుగానే బిగ్‌ బాస్ ను అత్యల్పంగా చూడటం జరిగింది.ఏమాత్రం క్రేజ్ లేని బిగ్‌ బాస్ కంటే వరల్డ్ కప్ మ్యాచ్ అది కూడా ఇండియా పాక్ మ్యాచ్‌ ను వదిలి పెట్టి ఎలా చూస్తారు అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బిగ్‌ బాస్ సీజన్‌ 5 చరిత్రలో ఇది చెత్త రికార్డుగా చెత్త రేటింగ్ గా నమోదు అవ్వబోతున్నట్లుగా బుల్లి తెర వర్గాల వారు చెబుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube