బుల్లితెర యాంకర్ ప్రదీప్ మాచిరాజు, అమృతా అయ్యర్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న 30 రోజుల్లో ప్రేమించడం ఎలా సినిమా ఈ నెల 29వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న సంగతి తెలిసిందే.గతేడాది ఈ సినిమా విడుదల కావాల్సి ఉన్నా కరోనా విజృంభణ, లాక్ డౌన్ వల్ల సినిమా రిలీజ్ ఆలస్యమైంది.
ఇప్పటికే విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాగా సినిమాలోని నీలినీలి ఆకాశం పాట సినిమాపై అంచనాలను భారీగా పెంచింది.
ఎస్వీ బాబు నిర్మాతగా ఫణి ప్రదీప్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా చిత్ర యూనిట్ మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
హీరో ప్రదీప్ మాచిరాజు మాట్లాడుతూ తనను యాంకర్ గా ప్రజలందరూ ఆదరించారని.యాక్టర్ కావడం తన కల అని పేర్కొన్నారు.ఇప్పటివరకు చాలా టీవీ షోలు చేశానని ఆ టీవీ షోలు మంచి ఎక్స్ పీరియన్స్ ఇచ్చాయని ప్రదీప్ వెల్లడించారు.

యాక్టర్ కావాలనే కల తీరడానికి పది సంవత్సరాల సమయం పట్టిందని ప్రదీప్ మాచిరాజు పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని.సినిమాలో తన క్యారెక్టర్ ను దర్శకుడు బాగా డిజైన్ చేశాడని పేర్కొన్నారు.
నిర్మాత ఎస్వీ బాబు సినిమకు అవసరమైనవి అన్నీ ఇచ్చి బాగా నిర్మించారని వెల్లడించారు.అమృతా అయ్యర్ సినిమాలో బాగా నటించిందని ప్రదీప్ తెలిపారు.
అందరినీ మెప్పించేలా సినిమా ఉంటుందని పేర్కొన్నారు.
ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కిందని సినిమా చూసి అందరూ చిరునవ్వుతో బయటకు వస్తారని పేర్కొన్నారు.
సినిమాలో తన పాత్ర, పాత్ర చిత్రీకరణ బాగుంటుందని ప్రదీప్ అన్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం, చంద్రబోస్ సాహిత్యం సినిమాకు బాగా కుదిరాయని ప్రదీప్ తెలిపారు.యూవీ, గీతా సంస్థలు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను పంపిణీ చేయనున్నాయి.