టీనేజ్ నుండి ప్రారంభమయ్యే చర్మ సంబంధిత సమస్యల్లో మొటిమలదే ప్రధమ స్థానం.అయితే కొందిరికి మొటిమలు వచ్చాయంటే.
అస్సలు తగ్గవు.వీటినే మొండి మొటిమలు అంటారు.
ఇవి తీవ్రమైన నొప్పిని కలగజేయడంతో పాటు చర్మ సౌందర్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తాయి.దీంతో వాటిని వదిలించుకోవడం కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తుంటారు.
ఇరుగు పొరుగు వారు చెప్పిన చిట్కాలన్నీ ప్రయత్నిస్తుంటారు.కొందరైతే ట్రీట్‌మెంట్స్ కూడా చేయించుకుంటారు.
కానీ, ఇప్పుడు చెప్పబోయే న్యాచురల్ అండ్ పవర్‌ఫుల్ రెమెడీని ట్రై చేస్తే రెండు రోజుల్లో ముఖాన్ని పట్టి వదలని మొటిమలను మటుమాయం చేసుకోవచ్చు.మరి ఇంకెందుకు ఆలస్యం ఆ రెమెడీ ఏంటో చూసేద్దాం పదండీ.
ముందుగా మిక్సీ జార్ తీసుకుని అందులో నాలుగు టేబుల్ స్పూన్ల పెసలు, రెండు టేబుల్ స్పూన్ల ఓట్స్, వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసి మెత్తటి పౌడర్ మాదిరి గ్రైండ్ చేసుకోవాలి.
ఇప్పుడు ఈ పౌడర్‌లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆర్గానిక్ పసుపు, వన్ టేబుల్ స్పూన్ చందనం పొడి వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసి ఒక డబ్బా స్టోర్ చేసుకోవాలి.
ఇక ఈ పొడిని ఒక టేబుల్ స్పూన్ చప్పున గిన్నెలో వేసుకోవాలి.ఆ తర్వాత అందులో వన్ టేబుల్ స్పూన్ అలోవెర జెల్, వన్ టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ వేసి కలుపుకుని మొటిమలు ఉన్న చోట మాత్రమే కాకుండా ముఖం మొత్తానికి పూతలా వేసుకోవాలి.

ఇరవై నిమిషాల పాటు ఆరనిచ్చి.అప్పుడు వాటర్‌తో శుభ్రంగా ఫేస్ వాష్ చేసుకోవాలి.ఈ రెమెడీని తరచూ ట్రై చేస్తే మొటిమలు తగ్గడమే కాదు.మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.మరియు మొటిమలు వల్ల ఏర్పడే మచ్చలను సైతం ఈ రెమెడీ ద్వారా వదిలించుకోవచ్చు.