శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి రోజుకు రెండు సార్లు స్నానం చేస్తుంటాము.స్నానం చేయడం వల్ల బాడీపై ఉన్న బ్యాక్టీరియా, మలినాలు( Bacteria , impurities ) అన్నీ పోతాయి.
మరి బాడీలో ఉన్న మలినాలు మొత్తం ఎలా తొలగించాలి అన్నది ఎప్పుడైనా ఆలోచించారా.? నిజానికి ఆరోగ్యమైన జీవితాన్ని గడపాలంటే బాడీ పైనే కాదు బాడీలో ఉన్న మలినాలను కూడా తొలగించడం ఎంతో అవసరం.అయితే అందుకు ఇప్పుడు చెప్పబోయే డిటాక్స్ డ్రింక్( Detox drink ) ఎంతో ఉత్తమంగా సహాయపడుతుంది.
ఈ డ్రింక్ బాడీలో పేరుకుపోయిన చెత్తను మొత్తం తొలగిస్తుంది.
అదే సమయంలో మరెన్నో హెల్త్ బెనిఫిట్స్ కూడా అందిస్తుంది.మరి ఇంతకీ ఆ డిటాక్స్ డ్రింక్ ను ఎలా తయారు చేసుకోవాలో ఆలస్యం చేయకుండా తెలుసుకుందాం పదండి.
ముందుగా ఒక పెద్ద జార్ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు క్యారెట్ తురుము( Grated carrot ), రెండు టేబుల్ స్పూన్లు బీట్ రూట్ తురుము( Grated beet root ) వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం తురుము( Grate ginger ) , మూడు లెమన్ స్లైసెస్ వేసుకోవాలి.
వీటితో పాటు పావు టేబుల్ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి( Cumin powder ), పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసి జార్ నిండా వాటర్ పోసుకోవాలి.ఆపై బాగా మిక్స్ చేసి మూత పెట్టి నైట్ అంతా వదిలేయాలి.మరుసటి రోజు ఉదయాన్నే వాటర్ ను ఫిల్టర్ చేసుకుని నేరుగా సేవించాలి.ఈ డిటాక్స్ డ్రింక్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా శరీరంలో పేరుకుపోయిన మలినాలను తొలగిస్తుంది.శరీరాన్ని అంతర్గతంగా శుభ్రం చేస్తుంది.
అలాగే ఈ డిటాక్స్ డ్రింక్ మెటబాలిజం రేటును అద్భుతంగా పెంచుతుంది.అందువల్ల బరువు తగ్గాలని ప్రయత్నిస్తున్న వారికి ఈ డ్రింక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.నిత్యం ఈ డ్రింక్ ను తీసుకోవడం వల్ల మరింత వేగంగా బరువు తగ్గుతారు.పొట్ట వద్ద పేరుకుపోయిన కొవ్వు కరుగుతుంది.పైగా ఈ డ్రింక్ మైండ్ ను రిప్లేస్ చేస్తుంది.ఒత్తిడి, చిరాకు వంటి మానసిక సమస్యలను దూరం చేస్తుంది.