వైసీపీ కీలక నేత వైవీ సుబ్బారెడ్డి( YV SubbaReddy ) కీలక వ్యాఖ్యలు చేశారు.ఎన్నిక ఏదైనా వైసీపీదే విజయమని చెప్పారు.
రాజ్యసభలో ప్రతిపక్ష పార్టీ టీడీపీని క్లీన్ స్వీప్ చేశామని ఆయన తెలిపారు. రాజ్యసభలో ముగ్గురు వైసీపీ ( YCP )సభ్యులు ఏకగ్రీవం కావడం అనేది రాబోయే ఎన్నికల్లో మా విజయానికి సంకేతంగా నిలుస్తుందన్నారు.
అదేవిధంగా రానున్న లోక్ సభ ఎన్నికల్లోనూ టీడీపీని క్లీన్ స్వీప్ చేస్తామని ధీమా వ్యక్తం చేశారు.

తరువాత శాసనసభలోనూ తమ హవా చూపిస్తామని పేర్కొన్నారు.రాజ్యసభ సభ్యత్వ పత్రాన్ని అధికారికంగా అందుకున్న ఆయన ఈ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారింది.అయితే రానున్న అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ వైసీపీ ‘సిద్ధం’ సభ( Siddham )లతో ప్రజల్లోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.







